Home జిల్లా వార్తలు ఎలక్షన్‌ స్టంట్‌గా మిగిలిపోనుందా?

ఎలక్షన్‌ స్టంట్‌గా మిగిలిపోనుందా?

నెల్లూరుజిల్లా వాకాడు మండలంలోని దుగరాజపట్నం వద్ద కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించాలనుకున్న మేజర్‌ పోర్టు సాధ్యం కాదని ఇటీవల కూడా కేంద్రమంత్రి లోక్‌సభలో తేల్చి చెప్పాడు. షార్‌ అభ్యంతరాల వల్లనైతేనేమీ, పులికాట్‌ సరస్సు వల్లనైతేనేమీ దుగరాజపట్నం పోర్టు సాధ్యం కాలేదు. దుగరాజపట్నం పోర్టు లేదన్నాకే ప్రకాశం జిల్లా – నెల్లూరుజిల్లా సరిహద్దుల్లోని రామాయపట్నం పోర్టు తెరమీదకొచ్చింది.

దుగరాజపట్నం పోర్టు వస్తే ప్రకాశం జిల్లా కంటే నెల్లూరు జిల్లాలోని కావలి ప్రాంతమే ఎక్కువుగా అభివృద్ధి చెందు తుంది. అందుకే రామాయపట్నం పోర్టు సాధన కోసం బీద సోదరులతో పాటు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డిలు పోరాడారు.

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కావలి, కందుకూరు, కొండెపి, సంత నూతలపాడు, ఒంగోలు, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో కొంత సాను కూల వాతావరణాన్ని కల్పించుకోవడం కోసం బీద సోదరులు అడిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించడానికి అంగీకరించారు. వాస్తవా నికి రామాయపట్నం ప్రాంతం కృష్ణపట్నం పోర్టు పరిధిలోకి వస్తుంది. 30ఏళ్ళ కాలం పాటు ఆ పరిధిలో మరో పోర్టు కట్టడానికి వీల్లేదు. కాని, గతంలో వున్న ఆ జి.ఓను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కూడా రామాయ పట్నం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోర్టు నిర్మాణానికి అంగీకరించడంతో రామాయపట్నం పోర్టు సాధ్యమైంది.

ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రామాయ పట్నం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమకు చేసి నట్లే ఇక్కడా శంకుస్థాపన జరిగిపోయింది. రామాయపట్నం వద్ద పేపర్‌ పరిశ్రమ వస్తుందని తెలుస్తోంది. దాంతో పాటు గ్రానైట్‌ ఎగుమతులు కూడా వుంటాయి కాబట్టి చాలా తక్కువ బెర్తులతో ఇక్కడ పోర్టును రన్‌ చేయొచ్చు. కాని కృష్ణపట్నం పోర్టులో 13బెర్త్‌లకే వ్యాపారం లేదు. ముందు పరిశ్రమలు వస్తే ఆటోమేటిగ్గా ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయి. తద్వారా పోర్టు అవసరం పెరుగుతుంది. రాష్ట్రానికి పరిశ్రమలేవీ తేకుండానే పోర్టులు కట్టుకుని ఏం లాభం? కేవలం ఎలక్షన్‌ దృష్టిలో పెట్టుకుని శంకుస్థాపనలు చేస్తున్నట్లుగా వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here