Home రాష్ట్రీయ వార్తలు ఎలక్షన్‌ యాక్షన్‌

ఎలక్షన్‌ యాక్షన్‌

భారతీయ సాంస్కృతిక చరిత్రలో 64 కళలుంటాయి. మన దేశంలో ఎన్నికల వ్యవస్థ మొదలు కాకముందు 64కళ లనే తేల్చారు. ఇప్పుడు ఎన్నికల నిర్వహణను 65వ కళగా చేర్చవచ్చు. ఈ 65వ కళలో ఆరితేరిన వాడే నారా చంద్రబాబునాయుడు.

ఎలక్షన్‌ అన్నది ఒక ఆట. ఇందులో బాగా ఆడి నెగ్గుకురావడం అన్నది ఒక కళ. ఈ కళలో రాటుదేలిన ఆటగాడు చంద్రబాబునాయుడు. ఈ ఆటలో లూప్‌హోల్స్‌ అన్నీ ఆయనకు బాగా తెలుసు. ఎన్నికల ఆటను ధాటిగా కాదు, టెక్నికల్‌గా ఆడుతాడు. తాను కెప్టెన్‌ అయినప్పటికి తనకంటే మెరుగైన ఆటగాడు తన జట్టులో వుంటే ఎక్కువ సేపు ఆడే అవకాశం అతనికే కల్పిస్తాడు. లేదా బయట జట్లలో ఎవరన్నా మెరుగైన ఆటగాడున్నాడని తెలిస్తే ప్యాకేజీ ఎరవేసి ఆ ఆటగాడిని తన జట్టులోకి తెచ్చు కుంటాడు. ఎవరు ఆడారు, ఎవరు ఎన్ని గోల్స్‌ వేసారు అన్నది ఆయనకు ముఖ్యం కాదు… ఆటలో గెలిచామా లేదా అన్నదే ఆయనకు ప్రధానం. ఎందుకంటే తన జట్టు గెలిస్తే పేరొచ్చేది ఆయనకే! పదవొచ్చేదీ ఆయనకే కదా!

ప్రతిపక్షంలో వున్న వైయస్సార్‌ కాం గ్రెస్‌ నాయకులు ఇంకా పాదయాత్రలు చేసుకునే పనిలోనే వున్నారు. సభలకు వస్తున్న జనాన్ని చూసి చంకలు గుద్దుకునే పనిలో వున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, చంద్రబాబు పరివారం అవినీతి అక్ర మాలు, టీడీపీ నుండి జనసేన విడి పోవడం, ఈసారి బీజేపీతో టీడీపీ పొత్తు లేకపోవడం, కాపుల రిజర్వేషన్ల వివాదం, బ్రాహ్మణ సంఘాల గొడవలు, అమలు కాని ఋణమాఫీ, ఆచరణలో సాధ్యం కాని భ్రమరావతి… ఇవన్నీ తమకు ప్లస్‌ పాయింట్లని వైకాపా నాయకులు భావి స్తున్నట్లుగా వుంది.

అయితే ఇవన్నీ తమకు ప్లస్‌లని వైసిపి నాయకులు ఎంతగా ఆశపడుతున్నారో, ఇవన్నీ తనకు మైనస్‌లని తెలుసుకోలేనంత అమాయకుడు కాదు చంద్రబాబు. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చి, వాటికి మసిపూసి మారేడుకాయలు చేసే తెలివితేటలు ఆయనకు లేకపోలేదు.

వైకాపా నాయకులు ఇంకా ఎన్నికల మూడ్‌లోకి రాలేదు. అంతా జగన్‌ పాద యాత్ర ఎప్పుడు పూర్తవుతుందా? ఎన్నికల ప్రణాళికపై జగన్‌ తమతో ఎప్పుడు చర్చిస్తాడా అని ఎదురుచూస్తున్నారు. కాని చంద్రబాబు మాత్రం కొన్ని నెలల క్రితమే ఎన్నికల యాక్షన్‌ మొదలుపెట్టాడు. ఒక రకంగా ఆయన 2014లో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి క్షణం నుండే 2019లో జరగబోయే ఎన్నికల ప్లాన్‌ గురించి ఆలోచిస్తుంటాడు. ఎన్డీఏ నుండి బయటకు రావడం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేత విడిగా పోటీ చేయించాలనుకోవడం ఆయన ఎన్నికల యాక్షన్‌లో భాగమే! మేధావి ముసుగులో జె.డి లక్ష్మీనారాయణను తిప్పుతున్నది ఆయనే! సీపీఎం, సిపిఐలను వైసిపితో కలవకుండా జనసేనకు చేరువచేసిందీ ఆయనే! ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభించేలా కాం గ్రెస్‌తో సైతం పొత్తుకు సిద్ధమవుతున్నది కూడా ఎన్నికల ప్రణాళికలో ఒక వ్యూహమే!

నాలుగేళ్ళ దాకా అన్నక్యాంటీన్‌ల ఊసే లేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయనే సరికి రాష్ట్రంలో అన్న క్యాంటీన్‌లు వెలిసాయి. అన్న క్యాంటీన్‌లో అన్నం తిన్న ప్రతోడు తనపై విశ్వాసం చూపిస్తాడన్నది చంద్ర బాబు నమ్మకం. ఎన్నికలు దగ్గరకొచ్చే సరికి చంద్రబాబుకు నిరుద్యోగభృతి గుర్తుకు వచ్చింది. ఇటీవలే నిరుద్యోగ భృతి ప్రకటిం చడం తెలిసిందే! ఇక పింఛన్‌లు పెంచి వృద్ధులకు ఓట్ల వల విసరబోతున్నాడు.

2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశంకు, అధికారం మిస్స యిన వైకాపాకు తేడా 5లక్షల ఓట్లే! 2014లో తమకు పడ్డ ఓట్లన్నీ ఇప్పటికీ తమ వెంటే వున్నాయని జగన్‌ నమ్మకం! జనసేన అయినా బీజేపీ అయినా తెలుగు దేశం ఓట్లనే చీలుస్తాయి. ఇక గతంలో టీడీపీకే ఓట్లేసిన కాపులు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, బలహీనవర్గాలలో కొంత ఓటు బ్యాంకు తమ వైపు రావచ్చని వైసిపి శ్రేణుల నమ్మకం. అయితే అంత అతివిశ్వాసం పనికిరాదు. 2014లో తనకు పడ్డ ఓట్లలో కొంత శాతం ఓటింగ్‌ పక్కకుపోతుందని చంద్రబాబుకు తెలుసు. ఆ లోటును పూడ్చు కోవడానికి ఆయన వైసిపి ఓటు బ్యాంకుకు టెండర్‌ పెట్టాడు. రాష్ట్రంలో క్రిస్టియన్‌లు, ముస్లింలు వైసిపికి బలమైన ఓటు బ్యాంక్‌! 2014 ఎన్నికల్లో వీరిలో 80శాతం ఓట్లు వైసిపికే పడ్డాయి. ప్రత్యేకహోదా సాకు చెప్పి బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా బాగానే ప్రచారం చేయించు కున్నాడు. మైనార్టీల ఓట్ల కోసం ప్రత్యేక తాయిలాలు ఎరవేయబోతున్నాడు. ‘నారా హమారా – టిడిపి హమారా’ అంటూ గుంటూరులో ముస్లింలతో సదస్సు నిర్వ హించడం మైనార్టీ ఓట్ల దోపిడీకి సంకేతం! అలాగే క్రిస్టియన్‌ ఓట్లకు టెండర్‌ పెట్ట డానికి స్కెచ్‌ వేస్తున్నాడు. ఈ రెండు ఓటు బ్యాంకులను చంద్రబాబు ఏ మాత్రం కదిలించ గలిగినా వైసిపికి తీరని నష్టం ఖాయం. కులాల వారీగా, మతాల వారీగా ఓట్ల వేటలో చంద్రబాబు ఆటను ప్రారం భించాడు. వైసిపి శ్రేణులు వెంటనే అలర్టై ఆయనకు ధీటుగా ఎలక్షన్‌ గేమ్‌ ప్లాన్‌ చేయగలిగితేనే జగన్‌ అధికారం ‘ఆశ’యం నెరవేరగలదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here