Home జిల్లా వార్తలు ఎన్నికలొస్తున్నాయ్… అప్రమత్తంకండి – ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

ఎన్నికలొస్తున్నాయ్… అప్రమత్తంకండి – ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

రానున్న 6నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయని, ఈ తరుణంలో ఇప్పటి నుండే పనితీరు మెరుగుపర్చుకోవాలని నెల్లూరుజిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫెరెన్స్ హాల్లో సబ్ – డివిజనల్ పోలీసు అధికారులతో ఆయన నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కానిస్టేబుల్ నుండి ఏఎస్ ఐ వరకూ అందరూ తమ పరిధిలోని గ్రామాలను సందర్శించాలని ఆదేశించారు. నేరాలను ముందే పసిగట్టి అవి జరగకుండా నివారించే పోలీసింగ్ కావాలని సూచించారు. ప్రివెంటింగ్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని డిఎస్పీలను ఆదేశించారు. వాహనాల తనిఖీని ప్రతి రోజూ చేపట్టాలని, న్యాయాన్ని అమలు చేసేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని ఎస్పీ హెచ్చరించారు. ఫీల్డ్ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చి, వారానికి ఓ రోజు సమావేశమయ్యి ఫీల్డ్ విషయాలను చర్చించి, వాటిని డైరీలో నమోదు చేయాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here