Home జిల్లా వార్తలు ఎన్నికలలోపు పూర్తి చేయకురటే… నారాయణకు నష్టమే!

ఎన్నికలలోపు పూర్తి చేయకురటే… నారాయణకు నష్టమే!

రాబోయే ఎన్నికల్లో నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తాడంటు న్నారు. నగరం పరిధిలో చూస్తేనా జనం ప్రభుత్వాన్ని ధుమ్మెత్తి పోస్తున్నారు. భూగర్భడ్రైనేజీ పేరుతో రోడ్లన్నీ ధ్వంసం చేసి వున్నారు. ఈ పనులన్నీ ఎప్పటికి పూర్తవుతాయో చెప్ప లేకుండా వున్నారు. రూరల్‌ పరిధిలో కంటే కూడా నగర నియోజకవర్గం పరిధిలోనే పగులగొట్టిన రోడ్ల ప్రభావం ఎక్కువుగా వుంది. రూరల్‌ నియోజకవర్గంలో నగర పరిధి తక్కువ. వున్నంత వరకు రోడ్లు కొంచెం విశాలంగానే వున్నాయి. దీంతో ఒక వైపు రోడ్లను తవ్వినా జనం ఎలాగోలా సర్దుకుని పోతున్నారు. రూరల్‌ నియోజకవర్గ పరిధిలో తవ్విన రోడ్లను మరమ్మతులు చేయడం కొంత తొందరగానే జరుగుతోంది.

నగర నియోజకవర్గ పరిధిలో పరిస్థితి ఇలా లేదు. పాత కాలం ప్రాంతాలు ఎక్కువ. వీధులు ఇరుకుగా వుంటాయి. ఇలాంటి వీధుల్లో భూగర్భడ్రైనేజీ కోసం వున్న రోడ్లన్నింటిని తవ్వేసారు. తవ్విన రోడ్లతో ఆ వీధుల్లో నడవడమే కష్టంగా వుంటోంది. ఇక బైక్‌లు, కారులు వంటివి పోయినప్పుడు ఇంకెంత నరకంగా వుంటుందో… స్టోన్‌హౌస్‌పేట, సంతపేట, రంగనాయకులపేట, నవాబుపేట, ఉస్మాన్‌సాహెబ్‌ పేట, ఏసి నగర్‌, బాలాజీనగర్‌ ప్రాంతాల్లో రోడ్లు చాలా అధ్వాన్నంగా తయారయ్యాయి. ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. ఎన్నికలకు రెండుమూడు నెలల ముందే వీటిని సరిచేయకపోతే నగర నియోజకవర్గ ప్రజల ఆగ్రహాన్ని అధికారపార్టీ వాళ్ళు ఓటు రూపంలో చూడాల్సి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here