Home రాష్ట్రీయ వార్తలు ఎన్టీఆర్‌ ప్రభంజనాన్ని… తలదన్నిన 2019 ఎన్నికలు

ఎన్టీఆర్‌ ప్రభంజనాన్ని… తలదన్నిన 2019 ఎన్నికలు

ఓట్ల తుఫాన్‌ ఇలా వుంటుందా… ఫలితాల సునామీ ఇంటే ఇదా… అని ఆశ్చర్యపరిచేటంతగా ఈ ఎలక్షన్‌ ఫలితాలున్నాయి. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు 1983నాటి ఫలితాలను ప్రభంజనంగా చెప్పుకుంటుంటారు. అయితే ఈ ఎన్నికల ఫలితాల ముందు 1983 నాటి ఎన్టీఆర్‌ ప్రభంజనం కూడా తుడిచి పెట్టుకుపోయింది.

1983 ఎన్నికల్లో కూడా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం క్లీన్‌స్వీప్‌ చేయలేకపోయింది. ఆ ఎన్నికల్లో జిల్లాలో మిగిలిన అసెంబ్లీలన్నీ కూడా తెలుగుదేశం ఖాతాలో పడ్డా, ఉదయగిరి అసెంబ్లీ నుండి మాత్రం బీజేపీ అభ్యర్థిగా యం.వెంకయ్యనాయుడు విజయం సాధించాడు. ఉదయగిరిలో టిడిపికి డిపాజిట్‌ దక్కలేదు.

అప్పటి ఎన్నికలతో పోలిస్తే, అప్పటి ఎన్టీఆర్‌ ప్రభంజనంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో జగన్‌ సునామీనే సృష్టించాడని చెప్పవచ్చు. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేశారు. నెల్లూరు సిటి, కావలి, సర్వేపల్లి నియోజకవర్గాలను మినహాయిస్తే మిగతా 7 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ భారీ మెజార్టీలు సాధించారు. ఏ రకంగా చూసినా జిల్లా రాజకీయ చరిత్రలో పెద్ద ప్రభంజనం 2019 ఎన్నికలే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here