Home జిల్లా వార్తలు ఎంతగొప్ప ప్రవాహమైనా.. చిన్న నీటిబొట్టుతోనే ప్రారంభమవుతుంది! కస్తూరిదేవి ప్రస్థానం కూడా.. చిన్నచిన్న అడుగులతోనే ఆరంభమైంది

ఎంతగొప్ప ప్రవాహమైనా.. చిన్న నీటిబొట్టుతోనే ప్రారంభమవుతుంది! కస్తూరిదేవి ప్రస్థానం కూడా.. చిన్నచిన్న అడుగులతోనే ఆరంభమైంది

ఎంత గొప్ప ప్రవాహమైనా చిన్న నీటిబొట్టుతోనే ఆరంభమవుతుంది. ఎంత పెద్ద యాత్ర అయినా..ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది. కస్తూరిదేవి విద్యాలయం ప్రస్థానం కూడా అంతే. ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ అంచలంచలుగా ముందుకు సాగింది. బాలికల చదువుకోసం విద్యాలయం నిర్మాణం గావించాలనే తదేక లక్ష్యంతో.. ఎంతో వ్యయప్రయాస లతో నాటి మహనీయుల నిరంతర కృషితోనే ఈ సరస్వతీనిలయం ఇక్కడ ఆవిర్భవించింది. ఇప్పుడు ఈ విద్యాలయంలో మనం చూసే భవనాలు వగైరాలన్నీ అప్పట్లో అప్పటికప్పుడు వచ్చినవేమీ కాదు. వాటి వెనుక ఎంతో కష్టం ఉంది. కృషి-పట్టుదల-శ్రమ ఉన్నాయి.

ఇటుక ఇటుక పేర్చుకుంటూ..కష్టనష్టాలన్నిటినీ అధిగమిస్తూ.. శ్రీమతి పొణకా కనకమ్మగారు, శ్రీయుతులు తిక్కవరపు రామిరెడ్డిగారు, డా. బెజవాడ గోపాలరెడ్డిగారు, ఆనం పద్మనాభరెడ్డి గారు, రేబాల దశరధరామిరెడ్డిగారు, ఎం.ఆదిశేషారెడ్డిగారు, మేనకూరు బలరామరెడ్డిగారు, వేమారెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ గారు… ఇలా ఎందరో మహానుభావులు.. సమాజసేవాభిలాషులు..వదాన్యులందరి సహాయ సహకారాలతో.. సింహపురి ప్రజల ఆశీర్వాదాలతో ఈ విద్యాలయం క్రమేణా అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ అభివృద్ధిలోకి వచ్చింది. అప్పట్లో చిన్నచిన్న కట్టడాలతో ప్రారంభమైన ఈ విద్యాలయం.. ఆ తరువాత పెద్ద భవనాల నిర్మాణాల దాకా సాగిందంటే… ఇదంతా నాటి మహనీయుల పుణ్యమే!…

కస్తూరిదేవి బాలికల హాస్టల్‌ను అందంగా తీర్చిదిద్దుతూ.. హాస్టల్‌కు ప్రహరీగోడ నిర్మిస్తే బావుంటుందనే ఆలోచన రావడంతో విద్యాలయం కమిటీ ఈ విషయం చర్చించేందుకు సమావేశమైంది. 1950లో జరిగిన ఆ కమిటీ సమావేశంలో కస్తూరిదేవి బాలికల హాస్టల్‌ భవనానికి ప్రహరీగోడ నిర్మిం చాలని కమిటీ తీర్మా నించింది.

అందుకు అప్పట్లో ఖర్చు సుమారు 2,350 రూపాయలవుతుందని అంచనా వేశారు. కమిటీ సభ్యులు శ్రీయుతులు ఆర్‌. దశరధరామిరెడ్డి, తిక్కవరపు రామిరెడ్డి, ఇ.సుందర రామిరెడ్డి, ఎం. ఆదిశేషారెడ్డి, శ్రీమతి పొణకా కనకమ్మ, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ, ఎం.హేమలత గార్లు సమావేశమై ఆ మేరకు తీర్మానం చేశారు. అదే విధంగా 20-7- 1951న జరిగిన సమా వేశంలో ఈ విద్యాల యానికి కొత్త స్కూల్‌ బిల్డింగ్‌ను నిర్మించా లని కూడా తీర్మానిం చుకుని ఆ పనులను అనుకున్న మేరకు క్రమబద్ధంగా నిర్వహిం చేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇలా కమిటీ వారి ఆధ్వర్యంలో కస్తూరిదేవి విద్యా లయం, హాస్టల్‌ భవనం వగైరాలు క్రమేణా అభివృద్ధి చెందుతూ వచ్చాయి.

విద్యాలయం అభ్యున్నతే అందరి లక్ష్యం…

ఆ తర్వాత 1952లో కస్తూరిదేవి విద్యాలయం కమిటీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తిక్కవరపు రామి రెడ్డిగారు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆనం పద్మనాభరెడ్డిగారు సెక్రటరీ, కరెస్పాం డెంట్‌ మరియు కోశాధిపతిగా ఎన్ని కయ్యారు. ఆమేరకు కొత్తకమిటీ ఎన్నికైన 2-9-1952న జరిగిన సమావేశంలో సభ్యులు తిక్కవరపు రామిరెడ్డి, బెజ వాడ గోపాలరెడ్డి, ఏ.పద్మనాభరెడ్డి, ఆర్‌.దశరధరామరెడ్డి, ఎం.ఏ శేషారెడ్డి గార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, కొత్త స్కూల్‌ బిల్డింగ్‌లో మెయిన్‌హాల్‌కు ప్రముఖ వదాన్యులు ‘శ్రీ రేబాల పట్టాభిరామరెడ్డి హాల్‌’గా నామకరణం చేయాలని అందరూ కలసి నిర్ణయించుకున్నారు.

అప్పట్లో అందరి ఆలోచనలు విద్యాలయం అభ్యున్నతిపైనే ఉండేవి. ఇంకా ఏమిచేస్తే విద్యాలయం మరింత వృద్ధిలోకి వస్తుందనే విషయంపై అనేకసార్లు కమిటీలోని ప్రముఖులంతా కలసి ఆలోచనలు సాగించేవారంటే వారికి ఈ విద్యాలయం పట్ల ఎంత అభిమానం ఉండేదో తేటతెల్లమవుతుంది. ఈ నేపథ్యంలో విద్యాలయానికి సంబంధించిన అనేక విషయాలను సుదీర్ఘంగా చర్చించుకునేందుకు 10-1-1953లో అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో 1944 నుంచి 1952 నవంబరు నెల వరకు తయారుచేసిన కమిటీ లేఖలన్నిటినీ కూలంకుషంగా పరిశీలించారు. విద్యాలయానికి ఏటా వస్తున్న లోటును ఎలా భర్తీ చేయాలో కూడా గంటలతరబడి వివరంగా చర్చిం చారు. ఆనాటి సమావేశంలో కమిటీ అధ్యక్ష కార్య దర్శులు తిక్కవరపు రామిరెడ్డిగారు, ఆనం పద్మనాభ రెడ్డిగార్లతో పాటు డా. బెజవాడ గోపాలరెడ్డిగారు, రేబాల దశరధరామిరెడ్డి గారు. ఎం.ఆదిశేషారెడ్డి గారు, మేనకూరు బలరామరెడ్డి గారు, వేమారెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు, పొణకా కనకమ్మ గారు, ద్రోణంరాజు లక్ష్మీ బాయమ్మగారు, ఎం. హేమలతమ్మగార్లు పాల్గొన్నారు.

పూజ్య బాపూజీ ఆశీస్సులతో ఎందరో వదాన్యుల వితరణతో మరెందరో మహనీయుల దీవెనలతో బాలికల విద్య కోసం ఏర్పడిన కస్తూరిదేవి విద్యాలయం పూర్వచరిత్రను కూలం కుషంగా పరిశీలిస్తే ఇలాంటి విషయాలన్నీ మనకు అర్ధమవుతాయి.

కమిటీ సమావేశాలంటే ఎంతో శ్రద్ధతో ఉండేవారు

కస్తూరిదేవి విద్యాలయానికి సంబంధించిన సమస్త వ్యవహారాలూ చూసుకునేది కమిటీయే కనుక, కమిటీ సమావేశాలు కూడా ఎంతో క్రమబద్ధంగా జరిగేవి. సభ్యులందరూ సమావేశాల పట్ల ఎంతో శ్రద్ధతో

ఉండేవారు. ఏ విషయమైనా సరే అందరూ సమావేశం కావా ల్సిందే తప్ప ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవారు కాదు. అందరి అభిప్రాయాలు విన్న తర్వాతనే అం దరూ కలసి తగు నిర్ణయాలు తీసుకునే వారే తప్ప, ఎలాంటి మొగమాటాలకీ ఇం దులో తావుండేది కాదు. అందులోనూ కమిటీలోని సభ్యులంతా ఎంతో గౌరవప్రదమైన కుటుంబాలవారు ఉండేవారు. అన్నిటికీ మించి అందరూ సమాజ సేవాపరాయణులు, జాతీయ భావాలు కలవారు కావడంతో కమిటీలో తీసుకునే అన్ని నిర్ణయాలు విద్యాలయం సర్వతో ముఖాభివృద్ధికి బాటలు వేసేవిగానే ఉండేవి.

సమావేశాల తేదీ నిర్ణయించాక ఆ రోజున ఎవరైనా సభ్యులు కారణాంతరాలవల్ల రాలేకపోతే, ఏ కారణం వల్ల రాలేకపోయారో వారు లేఖల ద్వారా తెలియజేసుకునేవారు. ఒకసారి ఈ సమావేశానికి రాలేకపోయిన రేబాల దశరధరామిరెడ్డిగారి వంటివారు కూడా ఎంతో వినమ్రంగా ‘ఐ కెనాట్‌ అటెండ్‌ ఇన్‌వ్యూ ఆఫ్‌ బ్యాంక్‌ మీటింగ్‌’ అని మినిట్స్‌లో రాశారంటే కమిటీ సమా వేశాల పట్ల వారికున్న చిత్తశుద్ధికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమి కావాలి?..

విద్యాలయం కమిటీ సమావేశాలు కూడా అప్పట్లో ఇంత చిత్తశుద్ధితో జరిగేవో తెలియజేసేందుకు ఇదొక

ఉదాహరణ మాత్రమే. కమిటీ సమా వేశాలంటే వారికంత శ్రద్ధాసక్తులు ఉండేవి. ఆ తర్వాత కొంతకాలానికి 15-12-1955లో జరిగిన కమిటీ సమావేశంలో డా. బెజవాడ గోపాలరెడ్డిగారు సభ్యులుగా తన పదవికి రాజీనామా చేయగా, ఆ స్థానంలో శ్రీ ఎన్‌వి రామానాయుడుగారిని కోఆప్ట్‌ చేసుకోవడం జరిగింది.

జాతీయ భావాలతో సమగ్రమైన చర్చలు.. సముచిత నిర్ణయాలు..

కమిటీ సమావేశాల్లో చర్చలు నిర్ధిష్టంగా జరిగేవి. తీసుకునే నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉండేవి. ఇందులో ఎలాంటి పక్షపాతానికి తావుండేది కాదు. ఈ సమావేశాల్లో విద్యాలయ నిర్వహణకు సంబంధించిన స్కూల్‌ లెక్కలు, హాస్టల్‌ లెక్కలపై జమాఖర్చులపై అందరి పరిశీలన ఉండేది. అందరూ ఈ విషయాలను గంటల తరబడి కూలంకుషంగా చర్చించి సముచితమైన నిర్ణయాలను తీసుకునేవారు.

ఎంతో ఉన్నతము, సంస్కారవంతమైన కుటుం బాలకు చెందిన ఆ మహనీయులందరూ అప్పట్లో జాతీయవాదంతో, దేశభక్తితో ఉండేవారు కనుక సమాజాభ్యున్నతి కోసం ఈ విద్యాలయం నిర్వహణ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. అప్పట్లో ఒక పెట్రోల్‌బంకువారు కొంత స్థలాన్ని లీజుకు అడిగినా వారి ప్రతిపాదనపై.. ”పెట్రోలు బంకుకు ఇప్పుడు

ఉండే స్థలము గాక జాస్తి స్థలము ఇచ్చుటకు నేను అంగీకరిం చను.. ఇది నా అభిప్రాయము” అని శ్రీమతి పొణకా కనకమ్మగారు స్పష్టం చేశారంటే… వారి నిబద్ధతను అర్ధం చేసుకోవచ్చు.

ఏ విషయమైనా సరే అందరు ప్రముఖులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకునేవారే తప్ప, ఎవరి చిత్తానుసారం వారు వ్యవహరించే వారు కాదు. ఎన్ని పని ఒత్తిడులు వున్నా కమిటి సమావేశాలకు తప్పనిసరిగా హాజరై తమ అభిప్రాయాలను నిష్కర్షగా వెల్లడించే వారు. విద్యాలయం పురోగతే పరమ లక్ష్యంగా అందరూ ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరించేవారు. అందుకే… అప్పట్లో వారి నిర్ణయాలు ఎంతో స్వచ్ఛంగా, అవసరమైతే కఠినంగా కూడా ఉండేవి. సమగ్రమైన చర్చలతో సముచితమైన నిర్ణయాలతో కమిటీ సమావేశాలు జరిగేవి. కమిటీ సమావేశాలు జరిగినప్పుడల్లా విద్యాలయం అభ్యున్నతికి సంబం ధించిన అంశాలపైనే వారు చర్చించి తగు నిర్ణయాలు తీసుకునేవారు. విద్యాలయం స్థాపన.. నిర్వహణ అంటే ఎంతో కష్టసాధ్యమైన ఆ రోజుల్లో.. అందులోనూ బాలి కలకు చదువెందుకనే నాటి కాలంలో సంఘ సేవాభిలాషతో ఆ మహనీయులందరూ అకుంఠిత సేవాభావంతో కలసి చేసిన కృషితో… నేడు ఈ విద్యాలయం సరస్వతీనిలయంగా వర్థిల్లుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here