Home రాష్ట్రీయ వార్తలు ఈడీ లీకులు వెనకున్నది పచ్చ ముఠానే !!

ఈడీ లీకులు వెనకున్నది పచ్చ ముఠానే !!

తన స్వార్థంకోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు దిగజారతాడనే దానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ . మీడియాలో తనమీద వ్యతిరేక వార్తలు రాగానే వాటిని మరుగుపర్చటం కోసం సొంత పచ్చ ఛానెల్స్ ని ఉపయోగించి బురదచల్లటం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య .

భారతి సిమెంట్స్ మీద కేసు వేసింది 2011 ఆగష్టు 10 న . ఆరోజు చంద్రబాబు కోసమే పనిచేసిన కేడీ లక్ష్మీనారాయణ కూడా భారతిగారు పేరు రాయలేదు . అప్పటికేసులో పసలేదని భారతి సిమెంట్ చార్జిషీట్లో ఉన్న అధికారులందరినీ ఇప్పటికే వదిలేసారు . సీబీఐ కేసుపెట్టింది 2011 ఆగస్టులో . భారతి గారు ఆతరువాతే ఎండీగా బాధ్యతలు చేపట్టి కంపెనీ వ్యవహారాలు చూస్తున్నారు . భారతి సిమెంట్ లో మెజారిటీ వాటాను ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫ్యాన్స్ కి చెందిన వికాట్ కంపెనీ కొనేసింది . అంతకుముందే భారతీ సిమెంట్ టెక్నాలజీ పరంగా భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది , అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ కంపెనీగా అవార్డులు గెలుచుకొంది . అందుకే ఫ్రాన్స్ కంపెనీ ఎక్కువ ధర చెల్లించి వాటాలు కొనుగోలు చేసింది . భారతి సిమెంట్లో పెట్టుబడులు పెట్టినవాళ్ళకి లాభాలు కూడా వచ్చాయి . అందుకే ఆ కేసులో పసలేకపోవటంతో అధికారులందరినీ సీబీఐ కోర్టు వదిలేసింది . సీబీఐ కోర్టులో తేలిపోతున్న కేసులో మళ్ళీ 7 సంవత్సరాల తరువాత భారతి గారు పేరుతొ లీకులు ఇస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారంటే వీళ్ళు ఏస్థాయికి దిగజారారో అర్థమవుతుంది .

మరి ఏడు సంవత్సరాల తరువాత 2018 ఆగష్టులో ఈరోజు ఈడీ ఎందుకు భారతిగారు పేరుతో లీకులు ఇస్తుంది ? దీనివెనుక ఎవరున్నారు ?

పరకాలప్రభాకర్ కి చంద్రబాబు ప్రభుత్వంలో అంత హోదా ఎందుకు దక్కింది ? దానివెనుక చంద్రబాబు లెక్కలు ఏమిటి ? జగన్ గారి మీదున్న కేసులలో సీబీఐ వరసగా చేతులెత్తేస్తుంటే ఎందుకు ఈడీ మాత్రమే అటాచ్మెంట్లు పేరుతొ హడావుడి చేస్తుంది ? దీనివెనుక ఉన్న శక్తులు ఏమిటి ?

పరకాలప్రభాకర్ భార్య నిర్మలాసీతారామన్ మొన్నటి ఫైనాన్స్ మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖని స్వతంత్ర మంత్రి హోదాలో ( ఇండిపెండెంట్ ఛార్జ్ ) నిర్వహించింది . ఈడీ అనేది నేరుగా అదే శాఖ కింద పనిచేస్తుంది . ఏరోజైతే ఆమెకి ఈ శాఖ దక్కిందో అదేరోజు ఇక్కడ రాష్ట్రంలో పరకాలని చంద్రబాబు అందలం ఎక్కించాడు . ఆమె అండదండలతోనే ఈడీలో చంద్రబాబు మనుషులైన ఉమాశంకరగౌడ్ , గాంధీ అనే ఇద్దరు పచ్చ అధికారులు కేంద్రంలో వివిధ హోదాలలో ఉన్నవాళ్లు ఈడీలోకి వచ్చారు . ఉమాశంకర గౌడ్ స్వయంగా టీడీపీ ఎంపీ దేవేందరగౌడ్ కి మేనల్లుడు . దేవేందరగౌడ్ పార్టీ నుండి బయటకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినా , ఆయనకి ఆరోగ్యం సరిలేక మంచానికే పరిమితమైనా కూడా చంద్రబాబు ఆయనని రాజ్యసభకు పంపాడు . దానికి కారణం ఈడీలో ఉన్న ఉమాశంకరగౌడ్ . ఒక పక్క పరకాల మరోపక్క ఈడీలో ఉన్న ఇద్దరి పచ్చ అధికారులు సహాయంతో అటాచ్మెంట్లు , అదనపు చార్జిషీట్లు పేరుతో లీకులు ఇస్తున్నారు .

జగన్ గారిని ఎలాగైనా రాజకీయంగా అంతంచేయాలని తప్పుడు కేసులు పెట్టించిన కాంగ్రెస్ హయాంలో ఈడీతో కాకుండా సీబీఐ తోనే వ్యవహారం నడిపారు . అప్పుడు చంద్రబాబు సొంత మనిషి కేడీ లక్ష్మీనారాయణ సీబీఐలో ఉండటంతో రోజుకొక లీకులు ఇస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా 16 నెలలు జైల్లో ఉంచగలిగారు .

ఆతరువాత సీబీఐ కేసులన్నీ కోర్టులలో వీగిపోవటంతో ఇప్పుడు పైన చెప్పిన ఇద్దరు పచ్చ అధికారులు సహాయంతో బరితెగిస్తున్నారు . ఆనాడు ఏవిధంగా అయితే కేడీ లక్ష్మీనారాయణ పచ్చ పత్రికలకి లీకులు ఇచ్చేవాడో ఇప్పుడు అదే విధంగా ఉమాశంకర గౌడ్ , గాంధీ లీకులు ఇస్తున్నారు .

ఈ ఇద్దరి అధికారులకి అసాధారణంగా మూడు పర్యాయాలు ఈడీలో పొడిగింపు ఇచ్చారంటేనే తెలుస్తుంది పచ్చ ముఠా ఎంత పకడ్భందిగా కుట్ర పన్నుతుందోనని .

చంద్రబాబు ఇలాంటి ప్రయోజనాలని పొందటం కోసమే రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టాడు . చంద్రబాబు , సృజనాచౌదరి ఇద్దరూ కలిసి అనేకమార్లు జైట్లీని కలిసినా బీజేపీ పెద్దలని కలిసినా వాళ్ళు కోరేది జగన్ గారిని ఏదోరకంగా కేసుల పేరుతొ జైల్లో పెట్టమని .

చంద్రబాబు ఆనాడు కాంగ్రెస్ తో కుమ్మక్కయి కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడి , రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ కి మద్దతిచ్చింది కూడా జగన్ గారిని కేసులలో ఇరికించే ఒప్పందంతోనే. మళ్ళీ ఈ నాలుగేళ్లలో ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టింది కూడా జగన్ గారిని ఏదోరకంగా అడ్డు తొలిగించటం కోసమే . మాకు ప్రత్యేకహోదా అవసరంలేదు , జగన్ ని ఏదోరకంగా జైల్లో పెట్టండి దానికోసం నేను చెప్పిన అధికారులని నియమించండి దానికితోడు నాకేసులు జోలికి రావొద్దు అంతకుమించి నాకేమి అవసరంలేదని ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టాడు .

మనం ఇంకో విషయం కూడా గమనించొచ్చు. సీబీఐ పేరుతొ కానీ , ఈడీ పేరుతో కానీ వచ్చే లీకులు కూడా చంద్రబాబు కష్టాలలో ఉన్నప్పుడే వస్తాయి . మీడియాలో చంద్రబాబు బ్యాడ్ అయినప్పుడల్లా ఇలాంటి పచ్చ అధికారులు రంగంలోకి దిగి ఏదో ఒక కేసుపెరుతో లీకులు ఇస్తారు . అలాంటి లీకులు కోసం , చంద్రబాబు తుచ్చ రాజకీయాలకోసం దిగజారి మహిళలని కూడా చూడరు .

చంద్రబాబు ఎంతటి ఘనుడంటే ఆనాడు కాంగ్రెస్ ని వాడుకొని కేసులు పెట్టించి , రాష్ట్రాన్ని విడగొట్టించి ఆఖరికి కాంగ్రెస్ కి చిప్పచేతికిచ్చాడు . మళ్ళీ బీజేపీతో జతకట్టి వాళ్ళని అడ్డంపెట్టుకొని సొంత ప్రయోజనాలకోసం ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టి కేసులలో లబ్ధిపొందుతున్నాడు . మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ ని బూచిగా చూపించి వాళ్లకి జగన్ తో సంబంధాలు అంటకట్టినట్లే రేపు కూడా ఆఖరికి తనచేతకాని తనాన్ని బీజేపీ మీదకి నెట్టేసి బీజేపీతో జగన్ కి సంబంధాలు అంటగట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నాడు .

2014 కి ముందు కాంగ్రెస్ ని పూర్తిగా వాడుకొని పిండి పిప్పి చేసి వదిలేసాడు . ఇప్పుడు బీజేపీ వంతు . చంద్రబాబుని నమ్ముకొని కాంగ్రెస్ ఏ విధంగా భూస్థాపితం అయ్యిందో రేపు బీజేపీకి కూడా అదే గతి పడుతుంది .

చంద్రబాబుకి ఎవరైనా అడ్డు అనుకొంటే వాళ్ళని ఎలాగైనా నాశనం చేసేవరకు నిద్రపోడు . దానికోసం తండ్రిలాంటి మామనే చంపేశాడు అలాంటిది రాష్ట్రం ప్రజలు పార్టీలు అసలు ఆయనకి లెక్క కూడా కాదు .

Credits : Mani Annapureddy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here