Home జిల్లా వార్తలు ఇస్తే పోటీ… లేకుంటే డ్యూటీ!

ఇస్తే పోటీ… లేకుంటే డ్యూటీ!

జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ముగ్గురు సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఒక జంపింగ్‌ ఎమ్మెల్యే వున్నాడు. ఈ నలుగురు కూడా 2019 ఎన్నికల్లో టిక్కెట్‌ను ఆశిస్తున్నవాళ్ళే! అయితే ఈ నలుగురిలో చూస్తే ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వద్ద మాత్రం ఒక క్లారిటీ వుంది. ఆయన మళ్ళీ సీటు కోసం ప్రయత్నిస్తున్నాడు. సీటిస్తే మళ్ళీ ఎంత ఖర్చయినా పెట్టుకుంటానంటున్నాడు. ఒక వేళ సీటు ఇవ్వకపోతే మూటాముల్లె సర్దుకుని తన డ్యూటీకి తాను పోతానంటున్నాడు. అంటే కాంట్రాక్ట్‌ పనులు చేసుకోవడానికి! అయితే బొల్లినేని రామారావుకు ఒక గట్టి నమ్మముంది. ఉదయగిరి సీటు మళ్ళీ తనకే వస్తుందని. దానికి కారణాలు లేకపోలేదు. ఉదయగిరి సీటులో వుండే వాళ్లెవరూ తనకంటే బలమైన వాళ్ళు కాదనే నమ్మకం. ప్రజాబలంలో ఆయనకంటే మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ముందుంటాడు. కాని ధన బలంలో వీక్‌. ఆయన్ను పక్కనపెడితే రేసులో వున్న కావ్య కృష్ణారెడ్డి, అశోక్‌బాబు, బ్రహ్మయ్య వంటివాళ్ళు తన ముందు చాలరనే నమ్మకం బొల్లినేనికి వుంది. అందుకే ఆయనకు సీటు తనకు రాదనే డౌటు లేకుండా వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here