Home గల్పిక ఇమ్రాన్‌పై దాడికి పాల్పడ్డ కూటమి నేతలు

ఇమ్రాన్‌పై దాడికి పాల్పడ్డ కూటమి నేతలు

అది న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌… రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ఉప రాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు కలిసి టీ తాగుతూ రిపబ్లిక్‌ టీవీలో భారత ఫైలట్‌ అభినందన్‌ విడుదలకు సంబంధించిన వార్తా సన్నివేశాలను చూస్తున్నారు. అంతలో టీవీ స్క్రీన్‌పై బ్రేకింగ్‌ న్యూస్‌ అంటూ ఫ్లాష్‌ న్యూస్‌ రాసాగాయి. పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌పై భారత్‌లోని మహాకూటమి నేతల దాడి… కొద్దిపాటి గాయాలతో తప్పించుకున్న ఇమ్రాన్‌… దాడిలో పాల్గొన్న రాహుల్‌, మమతా, అరవింద్‌ కేజ్రీవాల్‌, చంద్రబాబు, కుమారస్వామి… పాక్‌ ఆర్మీ సాయంతో బయటపడి సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇమ్రాన్‌… మహాకూటమి నేతల దాడికి పాకిస్థాన్‌ ప్రజల మద్దతు… సన్నివేశాలు లేకుండా వట్టి ఫ్లాష్‌ న్యూసే వచ్చాయి. దీంతో ఏం జరిగిందో వాళ్లిద్దరికీ అర్ధం కాలేదు. ఏం జరిగివుంటుంది వెంకయ్యాజీ అని రామ్‌నాథ్‌ కోవింద్‌ అడిగాడు. వెంకయ్య అప్పటికే బాగా

ఉద్విగ్నానికి లోనై… మనం మన దేశ భక్తిని పాక్‌ ఉగ్రశిబిరాలపై వైమానిక దాడులతో చూపిస్తే… వాళ్ళు ఏకంగా తమ దేశభక్తిని చూపించుకోవడానికి పాకిస్థాన్‌కెళ్లి ఆ దేశ అధ్యక్షుడిపైనే దాడి చేశారు. దేశ భక్తి అంటే వీళ్లది. వీళ్ళ దేశభక్తికి నా రోమాలే నిక్కబొడుచుకుం టున్నాయని చెప్పాడు. రామ్‌నాథ్‌ కోవింద్‌ వెంటనే ప్రధాని మోడీకి ఫోన్‌ చేసి… నువ్వు, మీ మంత్రులు వెంటనే రాష్ట్రపతి భవన్‌కు రండి అని చెప్పి పెట్టేశాడు. ఆయన ఫోన్‌ పెట్టేసిన పదిహేను నిముషాల్లో ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, రైల్వేమంత్రి పియూష్‌ గోయెల్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌లు అక్కడ వున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వారితో… చూశారా మహాకూటమి నేతల ధైర్యసాహ సాలు… వాళ్ళ దేశభక్తిని… మనం ఇక్కడ వుండి పాకిస్థాన్‌పై పోరాడుతుంటే, వాళ్ళు నేరుగా పాకిస్థాన్‌కే వెళ్ళి ఇమ్రాన్‌ ఖాన్‌ను తన్నబోయారు. దేశభక్తికి ప్రతి రూపం బీజేపీ నాయకత్వం అని మనం ప్రచారం చేసుకుంటుంటాం… కాని దేశ భక్తి అన్నది పలికే గొంతులోనే కాదు, తన్నే కాలిలోనూ కనపడాలని మహా కూటమి నాయకులు నిరూపించారు. హేట్సాఫ్‌ మహాకూటమి లీడర్స్‌ అని చెప్పాడు. ఉపరాష్ట్రపతి వెంకయ్య అయితే… మీరంతా మహాకూటమి పార్టీలపై అన వసరంగా నిందలేస్తున్నారు. పాకిస్థాన్‌కు వాళ్ళు అనుకూలంగా ప్రకటనలు చేస్తు న్నారంటూ మండిపడ్డారు. కాని, ఈరోజు వాళ్ళ దేశభక్తి ప్రదర్శన ముందు మన దేశభక్తి దిగదుడుపు అనిపిస్తోంది. మా హైటెక్‌రత్న చంద్రబాబుకైతే ఇంతకాలం తెలుగుదేశం మీదే భక్తి వుందనుకు న్నాను… ఆయనకు భారతదేశం మీద భక్తి ఇంకా ఎక్కువ వుందని ఇప్పుడే తెలుసుకున్నాను అని ఉద్వేగంతో అంటూ కళ్ళల్లోంచి ఉబికివస్తున్న నీటిని ఆపుకున్నాడు.

అంతా విన్న మోడీ… అలా హాల్‌లో కెళ్లి కూర్చుని మాట్లాడుకుందామని చెప్పి లోపలకు తీసుకెళ్లాడు. ధోవల్‌జీ ఆ సిడి ఇలా ఇవ్వండని అడిగాడు. అజిత్‌ ధోవర్‌ ఆయన చేతిలో ఒక సి.డి పెట్టాడు. వెంటనే ఆయన అక్కడే వున్న సి.డి ప్లేయర్‌లో దానిని పెట్టి ఆన్‌ చేశాడు. టీవీ స్క్రీన్‌పై సీన్‌లు మొదలయ్యాయి. అందరూ ఆసక్తిగా చూడసాగారు.

్య్య్య్య్య

అది ఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమి షనర్‌ కార్యాలయం… దాని ముందు కూర్చుని మహాకూటమి నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, దిగ్వి జయ్‌సింగ్‌, మమతా బెనర్జీ, చంద్రబాబు, అరవింద్‌ కేజ్రీవాల్‌, కుమారస్వామి, శరద్‌పవార్‌ తదితర నేతలు నల్లజెండాలు చేతపట్టి… ఇమ్రాన్‌ డౌన్‌డౌన్‌, భారత్‌లో ఉగ్రదాడులు అరికట్టలేని ఇమ్రాన్‌ దిగి పోవాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. వాళ్ల నినాదాలు విని కొద్దిసేపటికి పాకిస్థాన్‌ సైనిక కమిషనర్‌ సయ్యద్‌ సమర్‌ బయటకు వచ్చాడు. వారితో… మీరు ఇక్కడ ధర్నా చేసి లాభం లేదు… కావా లంటే మీ అందరికీ వీసాలు రెడీ చేయి స్తాను, ఇస్లామాబాద్‌కెళ్లి ఇమ్రాన్‌ఖాన్‌ తోనే తేల్చుకోండి అని చెప్పేశాడు. దానికి రాహుల్‌… మాకొచ్చే కసికి ఇమ్రాన్‌ఖాన్‌ ఎదురుపడితే విరగ్గొడతాం అని అన్నాడు. మమతా అయితే నేను కలకత్తా కాళికనై కసితీరా నలగదంతా అంది. చంద్రబాబు అయితే… ఆ మాత్రం బాధ వుండ దండి… రక్తం పొంగిపోతుంది అని అన్నాడు.

(ఈ సీన్‌లు చూస్తున్నప్పుడు రామ్‌ నాథ్‌ కోవింద్‌, వెంకయ్యల కళ్ళల్లో

నీళ్లు కారసాగాయి. వీళ్ళు చూపించేది దేశభక్తి కూడా కాదు, దేశంపై పిచ్చి… ఇలాంటి వాళ్ళనా మనం అపార్ధం చేసుకు న్నది అని మనసుల్లో అనుకోసాగారు.)

పాకిస్థాన్‌ హైకమిషనర్‌ వారితో… దయచేసి ఇక్కడ్నుండి వెళ్లండి… ఇస్లామా బాద్‌లో ఇమ్రాన్‌తో తేల్చుకోండని చెప్పి లోపలకు వెళ్లిపోయాడు.

మహాకూటమి నేతలు అక్కడ తమ వెంట తెచ్చుకున్న ఇమ్రాన్‌ఖాన్‌ బొమ్మను తగలబెట్టేసి నేరుగా పాలం విమా నాశ్రయం చేరుకున్నారు. ఇస్లామాబాద్‌ వెళ్లే విమానం ఎక్కారు.

రెండు గంటల తర్వాత ఇస్లామా బాద్‌ ఎయిర్‌పోర్టులో దిగారు. నేరుగా పాక్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ కార్యా లయానికి వెళ్లారు. పి.ఏ లోపలకు వచ్చి… సార్‌, భారత్‌ నుండి బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులు మిమ్మల్ని చూడడానికి వచ్చారు అని చెప్పాడు. వీళ్ళు వచ్చారని తెలిసి ఇమ్రాన్‌ఖాన్‌ సంబరపడ్డాడు. భారత్‌ కౌంటర్‌ టెర్రర్‌ అటాక్‌ విషయంలో ప్రపంచ దేశాలన్నీ తననే వేలెత్తి చూపించినా, తనకు అం డగా నిలిచింది భారత్‌లోని ప్రతిపక్షాలే! నన్ను అభినందించడానికే వీళ్ళు వచ్చి వుంటారు. వాళ్ళను లోపలకు పం పించు… అందరికీ మంచి బిరియానీ రెడీ చేయించు అని చెప్పాడు. పి.ఏ బయటకొచ్చి సార్‌ రమ్మంటున్నాడని చెప్పాడు. అందరూ లోపలకు వెళ్లారు. అందరూ తనను కౌగిలించుకుంటారని ఇమ్రాన్‌ ఊహించాడు. కాని, అక్కడ ఊహించని పరిణామం జరిగింది. ఒక్కసారిగా అందరూ ఇమ్రాన్‌పై దాడి చేశారు. ఆయన చొక్కా చించేసారు. ఆయన జుట్టు పీకారు. మమత అయితే… చేతకాని దద్దమ్మ అంటూ తిట్టసాగింది. రాహుల్‌ అయితే ఐస్‌పుల్ల నోట్లో పెట్టుకుని ఇమ్రాన్‌ను పడేసి ముఖం మీద కొట్టసాగాడు. లోపల గొడవ జరుగుతుందని తెలిసి బయట వున్న పాక్‌ మంత్రులు ఖురేషి, సయ్యద్‌షాలు లోపల కొచ్చారు. కూటమి నేతలను బలవం తంగా పక్కకు లాగి, గాయాలపాలైన ఇమ్రాన్‌ను సైనిక ఆసుపత్రికి పంపించారు. కోపంతో రగిలిపోతున్న కూటమి నాయ కులతో పాక్‌ మంత్రి ఖురేషీ… టెర్రరిస్ట్‌ దాడికి శిబిరాలపై వైమానిక దాడులు చేశారు కదా… మళ్ళీ ఈ దాడులు చేయడమేంటి? అని నిలదీశారు. అప్పుడు మమత… మా బాధ మీకు అర్ధం కాదులే… మేం ఇప్పటిదాకా నోట్ల రద్దు, జిఎస్టీ, వ్యవస్థల నిర్వీర్యం అంటూ మోడీకి వ్యతిరేకంగా దేశంలో బలమైన పునాదులు వేశాం. ఇంకో రెండు నెలలు ఓపిక పట్టుంటే ఎలక్షన్‌లు అయిపోయేవి… ఆ ఊపులోనే మోడీని ఓడించేవాళ్ళం. ఏదో మునిగిపోయినట్లు మీవాళ్ళు ఇప్పుడే పుల్వామా దాడికి పాల్పడ్డారు. అక్కడే మన్నా ప్రధానిగా వుండేది మన్మోహన్‌ సింగ్‌ అనుకున్నారా… అధికారంలో వుండేది కాంగ్రెస్‌ అనుకున్నారా? మీరు పుల్వామా దాడి అనగానే… మా మోడీ ఎయిర్‌ అటాక్‌ అనే… దీనికితోడు మీకు దొరికిన మా ఫైలట్‌ అభినందన్‌ను ఏదో మునిగిపోయినట్లు అప్పుడే విడిచి పెడి తిరి… మా దేశంలో జనాలంతా మళ్ళీ మోడీ జై అంటున్నారు. మా ఆశలన్నీ ఆవిరైపోయాయి… ఆ ఫ్రెస్టేషన్‌లోనే ఇమ్రాన్‌ను తుక్కురేగ గొట్టాం అని చెప్పింది. ఆమె మాటలు విని అక్కడున్న పాక్‌ మంత్రి ఖురేషే కాదు… టీవీలో ఆ సీన్‌లు చూస్తున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులు కూడా నోర్లెళ్ళబెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here