Home రాష్ట్రీయ వార్తలు ఇన్‌ఛార్జ్‌లతో ఇబ్బంది

ఇన్‌ఛార్జ్‌లతో ఇబ్బంది

రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో ఒక కొత్త సమస్య మొదలైంది. అదే నియోజక వర్గాల ఇన్‌ఛార్జ్‌ల సమస్య. నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు టిక్కెట్ల కోసం ముందువరుసలో నిలుస్తుండడంతో పార్టీలో కొత్తగా చేరాలనుకున్నవారికి పలు ఆటం కాలెదురవుతున్నాయి.

గత ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ 67 అసెంబ్లీ స్థానాలలో, 8 లోక్‌సభ స్థానాలలో గెలవడం తెలిసిందే! పార్టీ ఓడిపోయిన చోట్ల చాలావరకు ఓడి పోయిన అభ్యర్థులనే నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లుగా పెట్టారు. ఆ తర్వాత 23 మంది వైసిపి ఎమ్మెల్యేలు తెలుగు దేశంలోకి వెళ్ళగా, వారి స్థానాలలో అప్పటికప్పుడు ద్వితీయశ్రేణి నాయకు లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించడం జరిగింది. ఇన్‌ఛార్జ్‌ అంటే ఆ నియో జకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చూడడం వరకే! కాని, వైసిపి ఇన్‌ఛార్జ్‌లలో వచ్చే ఎన్నికలలో తామే అభ్యర్థులమనే ఫీలింగ్‌ వచ్చేసింది. దీనికితోడు నాలుగున్నరేళ్ళుగా వాళ్ళు అంతో ఇంతో పార్టీ కోసం ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు కొత్త నాయకులు వస్తే వీళ్ళకు సమస్యగా వుంది. వాళ్లొచ్చి తమ సీట్లకు ఎసరుపెడతారన్న భయంతో ఇన్‌ఛార్జ్‌లు ఎక్కడికక్కడ కొత్త నాయకులను రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక ఎన్నికల సీజన్‌ మొదలుకానుంది. అటు ఇటు వలసలు భారీగా వుంటాయి. టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీల నుండి వైసిపిలోకే వలసలు ఎక్కువుగా వుండే అవకాశముంది. జిల్లాకు ఒకరిద్దరు బలమైన నాయకులు వైకాపాలో చేరే సూచనలున్నాయి. రేపు ఎన్నికల్లో వైకాపాకు గెలుపు గుర్రాలు ముఖ్యం. కేవలం వై.యస్‌. గాలి, చంద్రబాబు వ్యతిరేకతే పూర్తిగా పార్టీని గెలిపించలేవు. అభ్యర్థులు కూడా కొంత సమర్ధులైవుండాలి. కాబట్టి పార్టీ గెలుపు కోసం ఇతర పార్టీల నుండి వచ్చే గట్టి నాయకులను తీసుకోక తప్పదు. కేవలం వైకాపాలో ఇన్‌ఛార్జ్‌ల సమస్యల వల్లే కొందరు నాయకులు వైసిపిలోకి రావడం ఆగిపోయినట్లుగా తెలుస్తోంది.

వైసిపికి రేపు గెలుపు గుర్రాలు ముఖ్యం. అధికారం వచ్చిందంటే ఇన్‌ఛార్జ్‌లుగా కష్టపడిన వాళ్ళకు ప్రత్యామ్నాయం చూడవచ్చు. అంతేగాని గట్టి అభ్యర్థులు కాలేరని తెలిసిన ఇన్‌ఛార్జ్‌లకు జగన్‌ సీట్లిచ్చుకుంటూ, కొత్త నాయకులను పార్టీలోకి తీసుకోకపోతే 2014 ఎన్నికల ఫలితాలకు రేపటి ఫలితాలకు పెద్ద తేడా కనిపించకపోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here