Home రాష్ట్రీయ వార్తలు ఇదే పాట.. పత్రీ చోట!…

ఇదే పాట.. పత్రీ చోట!…

”రావాలి జగన్‌.. కావాలి జగన్‌… మన జగన్‌”.. ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా.. ఇదే పాట. ప్రతీచోట ఈ పాటే వినిపిస్తోంది.. సామాజిక మాధ్యమాల్లో ఈ పాటే కనిపిస్తోంది. నెట్‌లోనూ ఈ పాటే హల్‌చల్‌ చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ.. మారుమూల గ్రామాల్లో కూడా ఈ పాటే మార్మోగిపోతోంది. ‘రావాలి జగన్‌-కావాలి జగన్‌’ అంటూ పల్లెల్లో, పట్టణాల్లోని జనం ఆ పాట వింటూ ఎంతో ఆనందిస్తున్నారు. ఏ నలుగురు ఏ కూడలిలో నిలిచినా కూడా ఈ పాటే పెట్టుకుని అందరూ వింటున్నారు. ఇక పార్టీ నాయకులకు, కార్యకర్తల విషయం చెప్పనే అక్కరలేదు.. వారికి ఈ పాట ఎంతో ఉత్తేజాన్ని,

ఉత్సాహాన్ని ఇస్తోంది. తమ ప్రచారాల్లో భాగంగా ముందుగా ఈ పాటనే అందరికీ వినిపిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే, పార్టీల ప్రచారగీతాల ప్రస్థానంలోనే… ఈ పాటకు ఉన్నంత ఆదరణ మరే పాటకూ రాలేదంటే అతిశయోక్తి కానే కాదు.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన ఈ ప్రచార గీతం సామాజిక మాధ్యమాల్లో అదరగొట్టే స్తోంది. అందులోనూ కొద్దిరోజుల్లోనే ఈ పాటకు ఇంత ఆదరణ రావడం అపూర్వం. మార్చి 11వతేదీన విడుదలైన ఈ పాటను కేవలం నెలరోజు ల్లోనే 2.21 కోట్లమంది వీక్షించారంటే ఈ పాట ఎంతగా ప్రజల్ని ఆకట్టుకుంటోందో తేటతెల్లమవుతుంది. ఒక రాజకీయపార్టీ రూపొం దించిన పార్టీ ఎన్నికల ప్రచారగీతాన్ని ఇంతమంది చూడడం.. కోట్లాది మంది వినడం ఇదే ప్రధమం కూడా.

‘ఐ-ప్యాక్‌’ బృందం రూపొందించిన ఈ పాట విడుదలైన కేవలం 20 రోజులకే కోటిమంది హృదయాలను తాకిందంటే ఎంతైనా అద్భుతమే మరి!.. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు దేశంలోని అనేక ప్రాంతాల్లో

ఉన్న జగన్‌ అభిమానులందరూ ఈ పాట పట్ల ఎంతగానో ఆకర్షితులవు తున్నారు. యువతీ యువకులైతే ఈ పాటను తమ ఫోన్లకు రింగ్‌టోన్‌గా కూడా ఏర్పాటు చేసుకుని మురిసిపోతున్నారు. ఒక ప్రాంతీయపార్టీ ప్రచారగీతం ఇంతగా జనాదరణ పొందడం.. రానున్న మార్పుకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here