Home జిల్లా వార్తలు ఇక్కడ కాకుంటే అక్కడ…?

ఇక్కడ కాకుంటే అక్కడ…?

మీరు సీటిచ్చారా ఓకే… లేకుంటే అవతల పార్టీ వాళ్ళు పిలుస్తున్నారు. అక్కడ నుండైనా పోటీ చేస్తాం… చాలామంది నాయకుల మనోగతం ఇది. రాజకీయాలలో ఇప్పుడు ట్రెండ్‌ మారింది.

ఒకప్పుడు నాయకులు తమకు అభి మానం వున్న పార్టీలలోనే వుండేవాళ్ళు. గెలిచినా, ఓడినా ఆ పార్టీల జెండాలు వదిలేవాళ్ళు కాదు. కాని, ఇప్పుడు రాజ కీయాలలో అలాంటి నాయకులు లేరు… పార్టీల పట్ల అభిమానం అన్నదే వాళ్ళకు తెలియదు. వాళ్ళకు తెలిసిందల్లా రాజ కీయాన్ని వ్యాపారంగా, కాంట్రాక్ట్‌ లావా దేవీగా చూడడమే!

జిల్లాలో ఒక ఎంపి, 10 అసెంబ్లీ సీట్లుంటే, ఇటు అధికార తెలుగుదేశం నుండి కాని ప్రతిపక్ష వైసిపి నుండి కాని ఆ సీట్లు ఆశిస్తున్న వాళ్ళు ఎక్కు వుగా వున్నారు. నెల్లూరు నగరం సీటు రేస్‌లో మంత్రి నారాయణతో పాటు మేయర్‌ అజీజ్‌, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, టి.అనూ రాధ రేసులో వున్నారు. వీరిలో మిగతా వాళ్ళ సంగతేమోగాని అబ్దుల్‌ అజీజ్‌ మాత్రం వచ్చే ఎన్నికల్లో తాను నెల్లూరు నగరం నుండి పోటీ చేసి తీరుతానంటు న్నాడు. ఆయన ధైర్యం టీడీపీ టిక్కెట్‌ రాకుంటే జనసేన అయినా టిక్కెట్‌ ఇస్తుందని.

వెంకటగిరి వైసిపి టిక్కెట్‌ ఆశించిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే! ఆయనను తమ పార్టీలోకి రమ్మని తెలుగుదేశం వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. అయితే వెంకటగిరి లేదా ఆత్మకూరు స్థానాలలో టిక్కెట్‌ ఇస్తేనే ఆ పార్టీలోకి వెళ్లాలనే ఆలోచనలో ఆయనున్నట్లు సమాచారం. మరోపక్క జనసేన నాయకులు కూడా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని తమ పార్టీ లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే వచ్చే ఎన్నికల్లో తాను కోవూరు ఎన్నికల బరిలో వుంటానని టీడీపీ నాయ కులు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి ప్రకటించాడు. ఒకవేళ టీడీపీ టిక్కెట్‌ రాకుంటే ఆయన ఏ పార్టీ నుండి కోవూరు అభ్య ర్థిగా వుం టాడు? వైసిపి అభ్యర్థిగా వస్తాడో లేక జనసేనలో చేరుతాడో అనే అనుమా నాలూ కలుగుతున్నాయి. అలాగే నెల్లూరు సిటి, ఉదయగిరి, కావలి, వెంకటగిరి, గూడూరులలో సీట్లను ఆశిస్తున్న పలువురు నాయకులు ప్రత్యామ్నాయంగా జనసేనను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఒకటికి మూడు పార్టీ లున్నాయి. డబ్బు పెట్టుకునే సత్తా వుండాలే గాని టీడీపీ, వైసిపి పార్టీలలో టిక్కెట్లు రాకున్నా జనసేన, కాంగ్రెస్‌, బీజేపీ వంటి పార్టీలు ఇలాంటి వాళ్ళకు సీట్లిచ్చేందుకు సిద్ధంగా వున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here