Home జిల్లా వార్తలు ఆ పార్టీలలో… వారిని వూహించుకోలేక పోతున్నారు!

ఆ పార్టీలలో… వారిని వూహించుకోలేక పోతున్నారు!

కొన్ని పార్టీల జెం డాలు కొందరికి సెట్‌ కావు. వారి మెడల్లో ఏ పార్టీ కండువా అంటే ఆ పార్టీ కండువా వుంటే అనుచరులు, అభిమానులు జీర్ణించుకోలేరు. ఇప్పుడు జిల్లా రాజకీయాలలో కావలి నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పరిస్థితి ఇదే! కావలి వైసిపి సిటింగ్‌ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి సీటివ్వొద్దంటూ పార్టీతో ఆయన లొల్లి పెట్టుకున్నాడు. ఆయనకు సీటిస్తే తాను మద్దతునిచ్చేది లేదని హెచ్చరించాడు. అయినా జగన్‌ ఆయనకే సీటిచ్చాడు. దీంతో కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి అలిగి తెలుగుదేశంలో చేరాడు. మొన్న చంద్రబాబు నెల్లూరొచ్చినప్పుడు ఆయన చేతులమీదుగా పసుపు కండువా కప్పుకున్నాడు. ఇప్పటివరకు సాగిన ఆయన రాజకీయ పయనానికి, ఇప్పుడు కట్టుకున్న పసుపు కండువాకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. ఆయన మెడపై పసుపు కండువాను ఆయన అభిమానులే జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన రాజకీయ ప్రయాణం ఎక్కువకాలం కాంగ్రెస్‌లోనూ, అందులోనూ వై.యస్‌.రాజశేఖరరెడ్డి అనుబంధంతోనూ కొనసాగింది. కాంగ్రెస్‌ తర్వాత వైసిపిలో కొనసాగాడాయన. ఇదేం పెద్ద మార్పు కాదు. కాని, ఇంతకాలం అల్లూరు ప్రాంతంలో తెలుగుదేశం వాళ్ళతోనే పోరాడిన ఆయన, ఇప్పుడు అదే తెలుగుదేశం జెండాతో ప్రజల ముందుకు పోతున్నాడు. ఈ పరిస్థితి ఆయన అనుచరులకు మింగుడు పడకుండాపోయింది.

అలాగే, సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో వుండి కేంద్రమంత్రిగా పార్లమెంట్‌ సభ్యురాలిగా పనిచేసిన పనబాక లక్ష్మి మెడలో పసుపు కండువ, తెలుగుదేశంలో మూడు దశాబ్దాల అనుబంధం వున్న బల్లి దుర్గాప్రసాద్‌ రావు మెడలో వైసిపి కండువా కూడా ఊహ కందని పరిణామమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here