Home నెల్లూరులో నేడు ఆ కారు తోలిందెవరు?

ఆ కారు తోలిందెవరు?

ఈ నెల 9వ తేదీ రాత్రి నెల్లూరు దర్గా మిట్టలోని యం.జి.బి మాల్‌లో ఓ సంఘటన జరిగింది. రాత్రి 10గంటల సమయంలో పార్కింగ్‌లో నుండి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అక్కడే వున్న ఇద్దరు చిన్నారులను ఢీకొట్టింది. ఆ చిన్నారులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కాని కారు తోలుతున్న వ్యక్తి కారును ఆపకుండా ముందుకు దూసుకుపోగా స్థానికులు కారును అడ్డగించారు. కారును తోలుతున్న వ్యక్తి పరారు కాగా, కారులో వున్న మిగతావాళ్ళు అక్కడే వుండిపోయారు. కారు సూళ్ళూరుపేటకు చెందిన వ్యక్తులదిగా గుర్తించారు. కారు తోలుతూ ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని మిధున్‌రెడ్డి అని గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే అతను కండీషన్‌లో వుండే కారు తోలాడా లేక మద్యం మత్తులో వున్నాడా అన్నది తేలాల్సి వుంది. గాయపడిన చిన్నారులకు ప్రాణాపాయం లేదుగాని గాయాలతో ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here