Home జిల్లా వార్తలు ఆవు పిడకలు కావాలా!… సెంట్రల్‌జైలును సంప్రదించండి!

ఆవు పిడకలు కావాలా!… సెంట్రల్‌జైలును సంప్రదించండి!

నెల్లూరు, చెముడు గుంటలోని జిల్లా కేంద్ర కారాగారంలో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి ఇందులో ఖైదీల ద్వారా సేంద్రీయ పద్ధతుల్లో వ్యవ సాయం చేయిస్తున్నారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ… వాటిని మార్కెట్‌లో అమ్మిస్తున్నారు. అలాగే ఈ వ్యవసాయ క్షేత్రంలో హోమాలు, యాగాలకు అవసరమయ్యే ఆవు పిడకలను, సేంద్రీయ వ్యవసాయం కోసం వర్మీకంపోస్ట్‌లను, గోమూత్రంతో జీవామృతంను తయారు చేయిస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్‌ రవికిరణ్‌ తెలిపారు. సుధార్‌ బ్రాండ్‌ పేరుతో త్వరలోనే వీటిని మార్కెట్‌లోకి విడుదల చేస్తామని, అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థల ద్వారా కూడా అమ్మకాలు జరుపుతామని, వీటిని కొనుగోలు చేసేందుకు 9494633862, 9182277371 నెంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here