Home గ్రామ సమాచారం ఆర్‌ఓఆర్‌ యాక్ట్‌ అమలులో.. విలీన గ్రామాలకు అన్యాయం

ఆర్‌ఓఆర్‌ యాక్ట్‌ అమలులో.. విలీన గ్రామాలకు అన్యాయం

భూముల క్రయవిక్రయాలకు సంబం ధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్‌ఓఆర్‌ యాక్ట్‌ను విలీన గ్రామాలకు కూడా వర్తింపజేసి ఆయా గ్రామాల్లోని ప్రజలకు, రైతాంగానికి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. 2014 సంవత్సరానికి ముందు ఉన్న రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం భూములకు సంబంధించిన వివరాలను నేరుగా ఎంఆర్‌ఓ, ఆర్‌ఐ, విఆర్‌ఓల సమక్షంలో విచారణ జరిపించి, ఆయా భూములను కొన్నవారు, అమ్మినవారితో విచారణ జరిపి, నేరుగా రెవిన్యూ అధికా రులే రిజిస్ట్రేషన్‌ చేసేవిధంగా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జిఓ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ జిఓ వల్ల జిల్లాలోని అనేక పంచాయతీల్లో న్యాయం జరుగుతోంది. అయితే కార్పొ రేషన్‌ పరిధిలోని విలీన గ్రామాలకు మాత్రం ఈ జిఓను వర్తింపజేయకపోవడం మాత్రం అన్యాయమని ప్రజలు భావిస్తు న్నారు. విలీనగ్రామాల్లో భూములను ఆర్‌ఓఆర్‌ యాక్ట్‌ కింద రిజిస్ట్రేషన్‌లు చేయ కుండా నిలిపేయడం వల్ల అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి నెల్లూరు రూరల్‌లో పొట్టేపాళెం, కలివెల పాళెం, కోడూరుపాడు, అంబాపురం, కొత్తూరు, అల్లీపురం వంటి 17 విలీన గ్రామాలున్నాయి, ఆ గ్రామాలు కార్పొరేషన్‌ పరిధిలో ఉన్నందువల్ల ఈ జిఓ వర్తించదని పేర్కొనడంతో భూములకు రిజిస్ట్రేషన్‌లు జరగక ఆయా గ్రామాల రైతులు అవస్తలు పడుతున్నారు. ఇటీవల భూములకు చెందిన రిజిస్ట్రేషన్‌ విలువ కూడా పెరిగిన నేపథ్యంలో ఈ జిఓని విలీన గ్రామా ల్లోనూ వర్తింపజేయడం వల్ల ప్రజలకు మరింత ఉపయోగంగా ఉంటుంది. రైతాం గానికి అవసరమైన రుణాలు, సబ్సిడీలు పొందడానికి గానీ, భూముల క్రయ విక్రయాలకు గానీ ఈ జిఓ వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాక, ఎన్టీఆర్‌ బోర్లు పేరుతో సాగునీటి ఎద్దడి నివారణ కోసం రైతులకు మంజూరు చేస్తున్న బోర్లను విలీన గ్రామాలకు కూడా కేటాయించే అవకాశముంటుంది. ఇవి కేవలం నెల్లూరు జిల్లాకే కాక, రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా విస్త రించిన అనేక నగరాలు, పట్టణాలకు సమీపంలో ఆవిర్భవించిన విలీన గ్రామా లన్నిటికీ ఈ జిఓలను వర్తింపజేస్తే, భూముల క్రయవిక్రయాల వల్ల పెరిగే రిజిస్ట్రేషన్‌లతో ప్రభుత్వానికి మంచి ఆదాయం కూడా వస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నిటినీ ఎలాంటి వివక్ష లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విలీన గ్రామాలకు కేటాయిస్తే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, రైతాంగానికి ఎంతో మేలుచేసినట్లవుతుందని ప్రజలు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here