Home రాష్ట్రీయ వార్తలు ఆయన మాట.. గెలుపుకు బాట!

ఆయన మాట.. గెలుపుకు బాట!

రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అంటే అటు సేవారంగంలోనూ ఇటు ఆథ్యాత్మిక రంగంలోను తెలియనివారు లేరు. అపర దానకర్ణుడిగా సేవారంగానికి వారధిగా, దైవ కార్యక్రమాలను నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆథ్యాత్మిక రంగానికి సారధిగా ఆయన ప్రస్థానం అసమానం.. అసామాన్యం. ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. వై.యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా వుంటూనే మంచివాడిగా మంచి మనసున్న వాడిగానే కాకుండా ఆయన సంకల్పించే ఏ పనైనా దిగ్విజయం అవుతుందనే సెంటిమెంటుని అటు పార్టీ అధినేతకీ ఇటు పార్టీ అభిమానులకు కలిగేలా చేశాడు.

2019 ఏప్రియల్‌ 11న జరుగనున్న ఎన్నికలకు సంబంధించిన తొలి జాబితాను సైతం విపిఆర్‌ చేత ప్రకటింపజేసి నిష్కల్మషమైన ఆయన మనస్తత్వాన్ని, కలిసొచ్చే ఆయన హస్తవాసిని అందరికీ తెలిసేలా చేశాడు పార్టీ అధినేత. విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర నిర్ణయించిన ముహూర్తాన 16వ తేదీన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చేత శుభసూచకంగా 9మంది పార్లమెంటు అభ్యర్థుల జాబితాను ప్రకటించాడు. ఆయన ప్రకటించిన అభ్యర్థుల ఫోటోలు అదేరోజు టీవీలలో, పక్కరోజు పత్రికలలో ప్రచురితమయ్యాయి. ప్రకటించిన 9మంది అభ్యర్థులకే రాష్ట్ర వ్యాప్తంగా విపరీత స్పందన వచ్చింది. ప్రకటించిన ఆ 9మంది అభ్యర్థులపై సానుభూతి కూడా వచ్చింది. ఆ పక్కరోజే మిగిలిన 16 లోక్‌సభ స్థానాల అభ్యర్థులను, 175 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఒకేసారి ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటనకు నిర్ణయించిన ముహూర్తబలమో, లేక వేమిరెడ్డి హస్తవాసి, వాక్‌శుద్ధి ప్రభావమో గాని ఆరోజు నుండే రాష్ట్రంలో వైసిపి వూహించని విధంగా పుంజుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here