Home జాతీయ వార్తలు ఆనం ఆగ్రహం వెనుక.. మర్మమేమిటో…?

ఆనం ఆగ్రహం వెనుక.. మర్మమేమిటో…?

మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి… నెల్లూరుజిల్లా పొలిటికల్‌ ఎపిసోడ్‌లో ఇప్పుడు మార్మో గుతున్న పేరు. ఈ మధ్యంతా ఆయన తెలుగుదేశాన్ని వీడి వైసిపిలో చేరనున్నాడనే దానిపై టాపిక్‌ నడిచింది. పార్టీలో బలమైన నాయకుడు, ఒక నియోజకవర్గానికి గట్టి అభ్యర్థి. కాబట్టి చంద్రబాబు ఆయనను అంత తొందరగా దూరం చేసుకోలేడు. ఏదో నచ్చచెప్పి టీడీపీ లోనే ఉండేలా చేసాడు. అదీగాక వైసిపి నుండి ఆయ నకు క్లారిటీ రాలేదు. దాంతోనే ముందుకు వెళ్ళలేక టీడీపీలోనే నిలబడ్డాడు.

కాని, మొన్న ఆత్మకూరులో నిర్వహించిన మినీమహానాడులోను, ఆ తర్వాత నెల్లూరు రూరల్‌ మినీ మహానాడులోనూ మంత్రి నారాయణ సమక్షంలో మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు పార్టీలోనే కలకలం రేపుతున్నాయి. సోమిరెడ్డిపైనే నేరుగా విమర్శనాస్త్రాలు సంధించాడు. రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ మంత్రిపై కారాలు మిరియాలు నూరాడు. తాను ఛార్జింగ్‌ లేని ఇన్‌ఛార్జ్‌నంటూ, తనకు ఎటువంటి పవర్‌ లేదంటూ ఆ సభలలోనే వాపోయాడు.

తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు ఎలాంటి వాతా వరణం నెలకొందనే విషయం ఎంతో అనుభవజ్ఞుడైన ఆనం రామనారాయణ రెడ్డికి తెలియంది కాదు. ఇది వై.యస్‌. రాజశేఖరరెడ్డి కేబినెట్‌ కాదు, మంత్రులు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో పని చేయడానికి! చంద్రబాబు కేబినెట్‌! పేరుకే వాళ్ళు మంత్రులు, నడిపించేదంతా చంద్ర బాబు, ఆయన కొడుకు చిన్నబాబు. సోమి రెడ్డికి అన్ని నియోజకవర్గాల నేతలతో సంబంధాలున్నప్పటికీ, గత నాలుగేళ్ళుగా ఆయన తన నియోజకవర్గానికే పరిమితం అవుతున్నాడు. మంత్రయ్యాక కూడా ఎవ రన్నా పిలిస్తేనే వారి నియోజకవర్గంలోకి వెళుతున్నాడు.

ఆనం రామనారాయణరెడ్డి స్థాయికి ఆయన ఒక జిల్లా మంత్రిపై విమర్శలు చేయాల్సిన పనిలేదు. అదికూడా బహిరంగ వేదిక మీద. ఆయన కావాలనుకుంటే నేరుగా చంద్రబాబుతోనే సమావేశం కావచ్చు. జిల్లాలో పార్టీ పరిస్థితిని వివ రించవచ్చు. మంత్రుల పనితీరు బాగా లేదని కూడా చెప్పొచ్చు. సీఎం ద్వారా మంత్రులకు వార్నింగ్‌ ఇప్పించవచ్చు. రామనారాయణరెడ్డి తనకు డైరెక్ట్‌గా వున్న లైన్‌ను వదిలేసి ఇలా పార్టీ వేదికల మీద మంత్రిపైనే విరుచుకుపడ్డాడంటే అది పార్టీపైన ఉన్న ప్రేమ… లేక కోపమా అని టీడీపీ నాయకులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ళ క్రితం పార్టీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డే తనకు అన్యాయం జరిగిందని ఇంతలా వాపో తుంటే చంద్రబాబుకంటే ముందు నుండి పార్టీలో వుండి పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసినోళ్ళు, జెండాలు పట్టి పట్టి చేతులు బొబ్బలెక్కినోళ్ళు, జిందాబాద్‌లు కొట్టి కొట్టి గొంతులు వాచిపోయినోళ్ళు, పార్టీ కోసం కోట్ల రూపా యలు ఖర్చుపెట్టి అప్పులపాలైన నాయ కులు ఇంకెంత బాధపడాలని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.

మొత్తానికి జిల్లా తెలుగుదేశం పార్టీలో మంత్రి సోమిరెడ్డే లక్ష్యంగా ఆనం రామ నారాయణరెడ్డి చేస్తున్న ఆరోపణలు, విమ ర్శలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here