Home జిల్లా వార్తలు ఆత్మకూరు భారం ఆదాలకే!

ఆత్మకూరు భారం ఆదాలకే!

ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి… సోమిరెడ్డి సూచిం చిన కన్నబాబుకా? అధిష్టానం ఆలోచనలకు తగ్గట్లుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన మెట్టుకూరు ధనుంజయరెడ్డికా? వీరిలో ఎవరికిచ్చినా రెండోవారిని పార్టీ దూరం చేసుకోవాల్సి వుంటుంది. అలాకాకుండా వీరిద్దరిని కిలిపి మరో ఇద్దరితో కమిటీ వేసినా వీళ్ళిద్దరూ పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలలో పాల్గొనరు. కాబట్టి పార్టీ మధ్యే మార్గంగా ఆలోచించింది. నెల్లూరు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌గా వున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డినే తాత్కాలికంగా, ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చేదాకా ఇన్‌ఛార్జ్‌గా నియ మించింది. ప్రస్తుతం ఆయన నెల్లూరు లోక్‌సభతో పాటు నెల్లూరు అసెంబ్లీ ఇన్‌ ఛార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఆత్మకూరు బాధ్యతను కూడా అదనంగా అప్పగించారు.

మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశాన్ని వీడి వైసిపిలో చేరడం దాదాపు ఖాయమనుకున్న తరుణంలో ఆత్మకూరులో ఎవరిని ఇన్‌ఛార్జ్‌గా పెట్టా లన్నది తెలుగుదేశం అధిష్టానానికి పెద్ద సవాల్‌గా మారడం తెలిసిందే! పార్టీ పరంగా ఇక్కడ ప్రస్తుతం అందుబాటులో వున్నది 2014 ఎన్నికల అభ్యర్థి గూటూరు కన్నబాబు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, ఇక 2009 ఎన్నికలప్పటికే పార్టీని వదిలేసి పోయిన మాజీఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడును కూడా ఆత్మకూరు అభ్యర్థిగా పరిశీలిస్తున్నారు. అయితే అభ్యర్థిని ఖరారు చేయడంకంటే ముందు పార్టీ కార్యక్రమాలు చూడడానికి ఇన్‌ఛార్జ్‌ను నియమించాల్సిన అవసరమొచ్చింది. అయితే ఎవరిని నియ మించాలి… గతంలో వున్న కన్నబాబునే నియమిద్దామా అంటే దీనివల్ల పార్టీకి కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఆత్మకూరులో ‘రెడ్డి’ సామాజికవర్గం బలంగా వుంది. ఈసారి ఆ వర్గం వారికే సీటివ్వాలంటే ఈ కోణంలో అక్కడ కన పడుతున్నది మెట్టుకూరు ధనుంజయరెడ్డి ఒక్కడే!

ఎలక్షన్‌లు ఇంకెంతో దూరంలో లేవు. ఇప్పటినుండి ఇన్‌ఛార్జ్‌గా వున్న నాయకుడు నియోజకవర్గంలో తిరుగుతుంటేగాని పార్టీపై, కేడర్‌పై గ్రామాలపై ఒక అవగా హన తెచ్చుకోలేని పరిస్థితి. కాబట్టి అభ్య ర్థిగా ఎవరినైతే నిలబెట్టదలుచుకున్నారో వారికే ఇన్‌ఛార్జ్‌గా నియమించమని స్థానిక నాయకులు, కార్యకర్తలు కోరుతూ వచ్చారు. ఇన్‌ఛార్జ్‌ రేసులో వున్న మెట్టుకూరు, కన్నబాబుకైనా, నాకైనా ఎవరికైనా ఒకరికే ఆత్మకూరు నాయకత్వం అప్పగించండని కోరుతూ వచ్చాడు.

అయితే వీరిద్దరిలో ఎవరికి ఇన్‌ఛార్జ్‌ అన్నది ఇప్పుడే నిర్ణయించడం కష్టతరంగా మారడంతో… తాత్కాలికంగా ఆదాలతోనే సమస్యను పరిష్కరించారు. రేపు ఆత్మకూరు అభ్యర్థి ఎంపిక కూడా నెల్లూరు పార్ల మెంటు అభ్యర్థిగా ఎంపికకాబడే నాయ కుడి ఇష్టానుసారమే నియమించే అవ కాశముంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here