Home జిల్లా వార్తలు ఆత్మకూరు తెరపై.. మళ్ళీ ‘గజని’

ఆత్మకూరు తెరపై.. మళ్ళీ ‘గజని’

ఎవరీ గజనీ అనుకుంటున్నారా…? మీ గెస్‌ కరెక్టే! 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించి మళ్ళీ 2004లో బీజేపీ నుండి పోటీ చేసి పరాజయం పొందిన బొల్లినేని కృష్ణయ్యే. ఈయనకు వ్యాపార వ్యాపకమే తప్ప రాజకీయ నాయకుల లక్షణాలు అస్సలు వుండవు. అవస రానికన్నట్లుగా ఏదో ఒక పార్టీ అభ్యర్థిగా తెరపైకి రావడం, ఇష్టమొచ్చినట్లుగా పైసలు ఎరవేసి గెలుపు కోసం ప్రయ త్నించడం, గెలిస్తే గన్‌మెన్‌లతో, ఓడిపోతే వాచ్‌మెన్‌లతో సరిపెట్టుకోవడం. ఇదీ ఆయన నైజం.

రాజకీయ నాయకుడంటే ప్రజల్ని గుర్తు పెట్టుకోవాలి. పరిచయమైన వాళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన వాళ్ళు కనిపిస్తే వాళ్ళని పేరుతో పలకరించాలి. గెలిచినా ఓడినా నిత్యం ప్రజలతో మమేకమై ఉండాలి. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటుండాలి. కానీ, ఈయన తీరు అంతా ”గజని” సినిమాలో ‘సూర్య’ పాత్రనే తలపిస్తుంది. ఒకటికి 10సార్లు కలిసినా, మనల్ని కలిసిన ప్రతిసారీ మనల్ని మనం పరిచయం చేసుకోవాలే తప్ప ఆయనకు గుర్తుండదు. ఒకవేళ పరిచయం చేసుకున్నా ఆ నిముషం ఓ చిద్విలాసం చిందించి మళ్ళీ మరచిపోయే నైజం కృష్ణయ్యది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆత్మకూరులో దిక్కూ దిశా లేకుండాపోయి పదేళ్ళ తరువాత మళ్ళీ ఈ ”గజనీ”ని తెరపైకి తెచ్చారు. ఇక ఆత్మకూరు ఓటర్ల పాట్లు జిల్లా పార్టీ దర్శకుడికే తెలియాలి పాపం…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here