Home జిల్లా వార్తలు ఆత్మకూరుకు నేనే మేస్త్రి

ఆత్మకూరుకు నేనే మేస్త్రి

రాష్ట్రంలో ఇంతవరకు ఏ అసెంబ్లీకి ఎవరు అభ్యర్థి అన్నది వైకాపా అధ్యక్షుడు వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి అధికారికంగా ప్రకటించ లేదు. సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు కూడా రేపటి ఎన్నికల్లో మేమే అభ్యర్థులమని చెప్పుకుని తమ తమ నియోజకవర్గాలలో తిరగడం లేదు. పార్టీ కార్యక్రమాలలో భాగంగా తిరుగుతున్నారంతే! కాని, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి మాత్రం ఆత్మకూరు సీటు నాదేనంటూ తిరుగుతున్నాడు. పార్టీ అధ్యక్షుడు ఇంతవరకు అధికారికంగా ప్రకటించకపోయినా గౌతమ్‌ మాత్రం తనను తాను అభ్యర్థిగా ప్రకటించేసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు అసెంబ్లీ నుండి వైసిపి అభ్యర్థిగా తానే బరిలో వుంటానని గౌతంరెడ్డి వెల్లడించారు. 18వ తేదీ ఆత్మకూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014లో కొన్ని లోపాల వల్ల వైసిపి అధికారంలోకి రాలేక పోయిందని, ఆ లోపాలను సరిదిద్దుకుంటున్నామని, వచ్చే ఎన్నికల్లో వైసిపి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశలో భాగంగానే కాంగ్రెస్‌లో వున్న సీనియర్‌ నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని, ఈ క్రమంలోనే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసిపిలో చేరినట్లు చెప్పారు. ఆనం రామనారాయణరెడ్డిని ఎక్కడ నుండి పోటీకి దించాలన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు. బహుశా ఆయనను వెంకటగిరి అసెంబ్లీ నియోజక వర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించే అవకాశాలున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆరునూరైనా వైసిపి అధికారంలోకి వస్తుందని, జగన్‌ ముఖ్యమంత్రి అవుతాడని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here