Home జిల్లా వార్తలు ఆఖరి పోరాటం

ఆఖరి పోరాటం

2019 ఎన్నికలలో జిల్లాలో కొంతమంది నాయకులు రిటైర్మెంట్‌ ప్రకటించి నట్లయ్యింది. వాళ్ళల్లో సీనియర్‌ మేకపాటి రాజమోహన్‌రెడ్డి. ఇక వయసు రీత్యా భవిష్యత్‌లో కూడా ఆయన పోటీ చేసే అవకాశాలుండవు. అలాగే కొమ్మి లక్ష్మయ్య, కంభం విజయరామిరెడ్డి వంటి నాయకులకు భవిష్యత్‌లో ఎన్నికల్లో పోటీకి అవకాశం రాకపోవచ్చు. నెలవల సుబ్రహ్మణ్యం ఇదే ఖాతాలోకి వస్తాడు. మాజీఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్రకు కూడా ఇక భవిష్యత్‌లో పోటీ చేసే అవకాశాలు రాకపోవచ్చు.

అలాగే 2019 ఎన్నికలు ఇంకొంతమంది నాయకులకు ఆఖరి పోరాటం కాను న్నాయి. ఇప్పుడు గెలిస్తేనే వీరికి భోగం, లేదంటే గృహ యోగమే! ఈ లిస్టులో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బొల్లినేని కృష్ణయ్య, బొల్లినేని రామారావు వంటి నాయకులు వున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here