Home గల్పిక అసెంబ్లీలో వై.యస్‌., రోశయ్యలను చూసి బాబు షాక్‌

అసెంబ్లీలో వై.యస్‌., రోశయ్యలను చూసి బాబు షాక్‌

పాతిక ప్రపంచ మేటి నగరాలను మిక్సీలో వేసి తిప్పి తీస్తే వచ్చిన అమరా వతి నగరం. ఉండవల్లిలోని హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం. సాయంత్రం 6గంటలైంది. అక్కడ కొం దరు వైద్యులతో పాటు సినీ దర్శకులు బోయపాటి శ్రీను, వి.వి.వినాయక్‌, హరీష్‌శంకర్‌, బి.గోపాల్‌, క్రిష్‌, తేజ వున్నారు. అప్పుడే అసెంబ్లీ నుండి చంద్రబాబు వచ్చాడు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెంట వచ్చారు. ఆయన కారు దిగగానే డాక్టర్లు చుట్టు ముట్టారు. ఒకరు బి.పి. చెక్‌ చేస్తుంటే, ఇంకొకరు పల్స్‌ చూస్తున్నారు. అప్పుడే భువనేశ్వరి కూడా అక్కడకు వచ్చింది. ఆమె ముఖంలో స్పష్టమైన ఆందోళన కనిపిస్తోంది. చంద్రబాబు కోపంగా… ఏంటి భువనేశ్వరీ ఇదంతా అని అరిచాడు. అందుకామె… అదిగో ఆ కోపానికే ఇదంతా… కోపం తగ్గించు కోండి… ఈరోజు అసెంబ్లీలో మీ ఆవే శాన్ని చూసి నాకు భయమేసింది. ఎక్కడ బిపి పెరిగిపోయి ఏమవుతుందోనని ఎంత గాబరా పడ్డాననుకున్నారు. ఇంత ఆవేశం మీలో ఎప్పుడూ చూడలేదు. అయినా మీకు ఉప్పు, కారం కూడా పెట్టడం లేదు కదా, కోపం ఎందు కొస్తుంది అని అడిగింది. అక్కడే వున్న ముదురుదోమల మంత్రి, నైట్‌రైడర్‌ పి.నారాయణ వుండి… భలేవారమ్మా, ఆ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అడిగిన ప్రశ్నలకు నాకే రోషమొచ్చింది… ఆయన ప్రశ్నలకు మన చంద్రబాబు గారు ఆ మాత్రం ఆవేశపడకపోతే ఆయనకు రోషం, పౌరుషం లేవనుకోరూ!… అయినా అదంతా నిజం ఆవేశమనుకున్నారా…. తెచ్చిపెట్టుకున్న ఆవేశం. సినిమాలలో మన బాలయ్యబాబు ఫ్యాక్షన్‌ సినిమాలలో యాక్షన్‌ చేస్తాడు చూడండి… అలాంటి ఆవేశమే అని చెప్పాడు. దాంతో భువ నేశ్వరి మనసు కుదుటపడి లోపలకు వెళ్లిపోయింది. ఆమె వెళ్లగానే అక్కడేవున్న సినీ డైరెక్టర్‌లతో… ఏం ఇలా వచ్చారు… పుష్కరాలు, నదీ హారతులు కూడా లేవే షూటింగ్‌లు తీయడానికి అని చంద్రబాబు అన్నాడు. దానికంటే ఇంపార్టెంట్‌ సార్‌, అలా లోపలకెళ్లి మాట్లాడుకుందామని బోయపాటి శ్రీను అనడంతో అందరూ హాల్‌లోకి వచ్చారు. వాళ్ళు అక్కడకు రాగానే అక్కడ వున్న సీన్‌ చూసి ఆశ్చర్య పోయారు. అక్కడ నారా దేవాన్ష్‌ ఉన్నాడు. ఎదురుగా ఏబిఎన్‌ ఛానెల్‌లో ఆరోజు అసెంబ్లీలో చంద్రబాబు ఆవేశంగా మాట్లాడిన మాటలను అనుకరిస్తున్నాడు. గుజరాత్‌కు ఎన్నిచ్చారండి… తమిళనాడు కెన్నిచ్చారండి… ఏం తమాసాలు చేస్తున్నారా… ఢిల్లీకి ఊడిగం చేస్తున్నారా, మీకు రోషం లేదు, పౌరుషం లేదు” అని ముద్దుముద్దుగా డైలాగ్‌లు చెబుతున్నాడు. ఆ బుడ్డోడి యాక్షన్‌ చూసి డైరక్టర్‌ క్రిష్‌… మనవడు మిమ్మల్ని మించిపోతాడు సార్‌ అని కితాబిచ్చాడు. చంద్రబాబు ఆ మాటకు మురిసిపోతూ అక్కడేవున్న సోఫాలో కూర్చుని దేవాన్ష్‌ను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. మంత్రులు, సినిమా డైరక్టర్లు అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి… ఎందుకొచ్చారని డైరక్టర్లను చంద్రబాబు అడిగాడు. అప్పుడు బోయ పాటి శ్రీను… సార్‌, ఈమధ్య యాక్షన్‌ సినిమాలలో, ఫ్యాక్షన్‌ సినిమాలలో ఒరిజి నాలిటీ తగ్గిపోతుంది. హీరోలలోగాని, విలన్‌ క్యారెక్టర్లలోగాని ఎమోషన్స్‌ కని పించడం లేదు. ఈరోజు అసెంబ్లీలో మీ ఆవేశం చూశాం, దానిలో ఒరిజినాలిటీ వుంది. అసలు మీ బామ్మర్ది బాలయ్య కంటే మీలో కనిపించిన ఆ ఆవేశమే చాలా క్లియర్‌గా వుంది. మీరు ఒప్పు కుంటే మీతో ఒక యాక్షన్‌ లేదా ఫ్యాక్షన్‌ సినిమా తీయాలని మేమంతా వచ్చామని చెప్పాడు. అది విని అక్కడేవున్న మం త్రులు గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పి.నారాయణలు చంద్రబాబు వద్దకెళ్లి… ప్లీజ్‌ ఒప్పుకోండి సార్‌, మేం కూడా మీ వెనుక ఉంటాం. మాకు ఎప్పటి నుండో సినిమాల్లో కనిపించాలని కోరికగా వుంది అని బ్రతిమలాడసాగారు. అంతా అక్కడే వుండి చూస్తున్న జేసీ దివాకర్‌రెడ్డి సినీ డైరెక్టర్‌లతో ఈ మూడు నెలలు ఆయన్ను వదిలేయండి… ఎలక్షన్‌ల తర్వాత ఫ్రీగా వుంటాడు కాబట్టి అప్పుడు ఎన్ని సినిమాలైనా చేసుకోండి అని వారిని పంపించాడు. జేసీ పొగిడాడో తిట్టాడో ఆర్ధం కాక చంద్రబాబు, మంత్రులు బుర్రలు గోక్కోసాగారు. తర్వాత మం త్రులు, ఎమ్మెల్యేలు ఆరోజు అసెంబ్లీలో చంద్రబాబు ఆవేశ సన్నివేశాలను రిపీట్‌ చేసి చూసుకుంటూ… అబ్బా భలే చేసా ర్సార్‌… భలే వాయించారు సార్‌ అని పొగుడుతూ మురిసిపోసాగారు.

————

విజయవాడలోని బీజేపీ కార్యా లయం. కన్నా లక్ష్మీనారాయణతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, మాణి క్యాలరావు, కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు సమావేశమై వున్నారు. విష్ణురాజు వుండి… మనం అడిగే ప్రశ్న లకు ఆ చంద్రబాబు సూటిగా సమాధానం ఇవ్వడం లేదు. అదేమంటే నోరేసుకుని అరుస్తున్నాడు. ఆయన అరుపులపై విరుచుకుపడదామంటే ఆ స్పీకర్‌ మాకు మైకివ్వడం లేదని చెప్పాడు. అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ… ఈరోజు సభలో సీన్‌ నేను నడిపిస్తా… మీరు ధైర్యంగా వెళ్లండి అని చెప్పాడు.

————-

అసెంబ్లీ హాల్‌… స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్‌రావు తన స్థానంలో కూర్చున్నాడు. సభ మొదలైంది. బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు లేచి… ఏపికి కేంద్రం ఎంత నిధులిచ్చింది… ఏమేం చేసిం దంతా చెప్పాడు. వెంటనే చంద్రబాబు ఆవేశంగా లేచాడు. తెలుగుదేశం సభ్యులు మనసులో… ఇక మనోడు మాణిక్యాల రావుకు సినిమా చూపిస్తాడురా అను కుంటూ మురిసిపోసాగారు. చంద్రబాబు కూడా ఆవేశంగా… ఏం పిచ్చపిచ్చగా వుందా… నిన్న ఇచ్చిన కోటింగ్‌ సరి పోలేదా… ఏమనుకుంటున్నారు మీరు… ఏం చేద్దామనుకుంటున్నారు రాష్ట్రాన్ని… నేను బిల్‌క్లింటన్‌నే ఏరా క్లింటన్‌ అని పిలుస్తాను… మీ మోడీని మనసు చంపు కుని ‘సార్‌’ అని పిలిచాను. ఆ మాత్రం కృతజ్ఞత లేదా ఆయనకు… నన్ను ఇప్పటి దాకా ఒకవైపే చూశారు. రెండోవైపు చూడాలనుకోవద్దు… తట్టుకోలేరంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు హాల్‌ అంతా పదిసెకన్ల పాటు నిశ్శబ్దం.. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ.. ”చంద్రబాబు ఎందుకయ్యా అంత ఆవేశం… ఇప్పుడేం మునిగిపోయిందని అంత ఆవేశం” అనే మాటలు ఒక మూల వినిపించాయి. ఆశ్చర్యం… అక్కడ కొణిజేటి రోశయ్య… ఆ పక్కనే వై.యస్‌.రాజశేఖరరెడ్డి.. చంద్రబాబులోనే కాదు, అక్కడున్న సభ్యులందరూ స్టన్‌ అయ్యారు. రోశయ్య మాటలు కొనసాగిస్తూ… అబ్బా, ఆ గుడ్లు రుమడమేంది చంద్రబాబు, మీ కోపం చూసి నాలాంటి గుండె వీక్‌గా వున్నోళ్ళు ఏం కావాలి. కొంచెం కోపం తగ్గించుకో వయ్యా… కూరల్లో ఉప్పు కారం తగ్గించ మని మా భువనేశ్వరమ్మకు చెప్పు అని వెటకారంగా అనగా… వై.యస్‌. వుండి… కూల్‌ బాబు కూల్‌… ఎప్పుడూ నవ్వుతూ వుండమ్మా, ఎందుకు ముఖం అలా మాడ్చుకుని వుంటావ్‌, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం… నవ్వుతూ బ్రతకాలి బాబు, నవ్వుతూ గడపాలి, నేను చూడు ఎంత ఉల్లాసంగా వున్నానో, ఎంత ఉత్సాహంగా వున్నానో… అని పవన్‌ కళ్యాణ్‌ స్టైల్లో యాక్షన్‌ చేశాడు. వారిద్దరు మాట్లాడిన మాటలతో చంద్రబాబుకు తల తిరగసాగింది.

—–

విజయవాడలోని బీజేపీ కార్యాల యంలో కన్నాతో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మాణిక్యాలరావు ఆరోజు అసెంబ్లీ సంఘటనలను వివ రిస్తూ… రోశయ్య, వై.యస్‌.లు కనిపించే సరికి దెబ్బకు చంద్రబాబు నోరు మూసే శాడు సార్‌… అయినా వాళ్లిద్దరూ సభకు ఎలా వచ్చారు… రోశయ్య వచ్చాడంటే అర్ధముంది, మరణించి స్వర్గానికి వెళ్లిన వై.యస్‌. రావడమేంటని సందేహంగా అడిగాడు. అప్పుడు కన్నా… వాళ్లు రియల్‌ వై.యస్‌., రోశయ్యలు కాదు, ‘యాత్ర’ సినిమాలోని క్యారెక్టర్‌ ఆర్టిస్టులు. ఎవరిని చూస్తే చంద్రబాబు నోట్లో మాట రాదో నాకు తెలుసు… అందుకే ఆ ఇద్దరి క్యారెక్టర్‌ ఆర్టిస్టులను అసెంబ్లీకి పంపిం చాను అని చెప్పాడు. అప్పుడు విష్ణు కుమార్‌ రాజు… ఈసారి అసెంబ్లీలో చంద్రబాబుకు ఇంకా గట్టి కౌంటర్‌ ఇవ్వడానికి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ను పంపించండి సార్‌, అసలు అసెంబ్లీలో ఆ క్యారెక్టర్‌ను చూస్తే చంద్రబాబు ఇక అసెంబ్లీకే రాడు అంటూ నవ్వుతూ లేచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here