Home జిల్లా వార్తలు అసెంబ్లీకే మొగ్గు

అసెంబ్లీకే మొగ్గు

ఈ కాలంలో ఒకసారి అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలిపెడితే మళ్ళీ దానిని చేజిక్కించుకోవడం కష్టం. ఇంకొకరికి ఛాన్స్‌ ఇచ్చామంటే మనం ఆ అసెంబ్లీ మీద ఆశలు వదులుకోవాల్సిందే! కావలి వైసిపిలోనే ఆ పరిస్థితి చూస్తున్నాం. 2014 ఎన్నికల్లో కావలి నుండి విష్ణు పోటీ చేయలేదు. రామిరెడ్డి ప్రతాప్‌ చొరబడ్డాడు. ఇప్పుడు విష్ణు అరచి గీపెట్టుకున్నా సీటు లేదు. అదే 2014లో వదలకపోయి వుంటే ఈరోజు విష్ణునే అక్కడ అభ్యర్థి. ఇలా జిల్లాలో పలు నియోజకవర్గాలున్నాయి. కావలి నియో జకవర్గంలో బీద సోదరులకు పట్టుంది. పరిస్థి తులు అనుకూలంగా వున్నాయి. ఇప్పుడు కావలిని వదిలేసి లోక్‌సభకు వెళితే… కావలి టిడిపిలో కొత్త నాయకుడు దిగితే… రేపు తిరిగి కావలిలో కాలుపెట్టాలన్నా వారికి కుదరకపోవచ్చు.

2019 ఎన్నికల్లో కావలి అసెంబ్లీ నుండే పోటీ చేస్తానంటున్నాడు రాజధాని నిర్మాణ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు. ఇటీవల కావలిలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న మస్తాన్‌రావు తాను కావలిని వదిలి పోయే ప్రసక్తే లేదని, ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని చెప్పాడు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గాన్ని వదిలి పెట్టలేదు. కావలిని కనిపెట్టుకునే వున్నాను. ఈ నాలుగున్న రేళ్లలో 3,097కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయించాను. ఇక్కడి ప్రజల కష్ట సుఖాలలో తోడుంటున్నాను. ఓడినచోటే మళ్ళీ ప్రజల మనస్సులు గెలుచుకోవాలన్నది నా తపన. అందుకే నిరంతరం మీ అభిమానం కోసం తపిస్తున్నానని ఆయన ఆ సభలో చెప్పుకొచ్చారు. అయితే నెల్లూరు పార్లమెంట్‌కు బి.సి అభ్యర్థి కావాలని అసెంబ్లీ అభ్యర్థులు కోరుకుని, ఆ దిశగా చంద్రబాబు తనను ఎంపీగా పోటీ చేయమని ఆదేశిస్తే అప్పుడు ఆలోచించాల్సి వస్తుందని, ఆ అవకాశం తక్కువుగా వుందని బిఎంఆర్‌ చెప్పారు. దీంతో ఆయన కావలి అభ్యర్థి అనేది గ్యారంటీ లేకుండా పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here