Home జాతీయ వార్తలు అసలు ఢిల్లీ లో ఏం జరిగింది

అసలు ఢిల్లీ లో ఏం జరిగింది

andhra pradesh cm chandrababu naidu bending in front of modi

బిజెపి – ఎన్డీయే తో తెగదెంపులు చేసుకున్నాక మొదటి సరిగా నిన్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు మొదటి సారిగా ఎదురు పడ్డారు. ప్రధాన మంత్రి నేతృత్వంలో జరిగే నీతిఆయోగ్ సమావేశానికి దేశం లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుడా హాజరయ్యారు.

అయితే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీడియా లో విపరీతంగా ప్రచారం చేయించుకునే చంద్రబాబు ఎన్నికలు దగ్గరకు వస్తుండే కొద్దీ అది అతిగా మారుతుంది. అబద్దాన్ని కూడా పది సార్లు నిజమని చెప్తే జనం గొర్రెల్లా నమ్ముతారని ఇంకా అదే భ్రమల్లో వున్నారు. గతంలో అయితే ఈనాడు రాసిందే వార్త , చెప్పిందే నిజం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రధాన వార్తా స్రవంతి లో ప్రతిపక్షం బలంగా లేకపోయినా సోషల్ మీడియా లో తెలుగు దేశం కంటే చాలా ముందుంది.

నీతిఆయోగ్ సమావేశానికి ముందు రెండు రోజులనుంచి ఇక సమరమే అంటూ , ఢిల్లీ లో భూకంపం సృష్టించాచడానికి వెళుతున్నట్టు విపరీతంగా ఒక వర్గం తెలుగు మీడియా ప్రచారం మొదలు పెట్టింది . ఢిల్లీ లో ఏ చిన్న అవకాశం దొరికినా దానిని కొండంతలుగా చేసి అది బాబు గారి ప్రతిభే అన్నట్టు ప్రచారం చెయ్యటానికి అంతా జాకీలతో సిద్ధమయ్యారు.

చంద్రబాబు మీడియా పులే గాని నిజం పులి కాదని తెలియని తెలుగు తమ్ముళ్లు కూడా సోషల్ మీడియా లో సిద్ధమయ్యారు. కానీ ఎప్పటిలాగే చంద్రబాబుకి మోడీ ని చూడగానే ఆటోమేటిగ్గా వెన్నులో వొణుకు మొదలయ్యింది. మరీ నిస్సిగ్గుగా మోడీ పలకరించకపోయినా , చెయ్యి అందించకపోయినా , ఎదో ఒక చెయ్యిలే అని పట్టుకుని ఇవి చేతులు కాదనుకో అన్నట్టు మొఖంలో ఎక్కడలేని దరిద్రపు నవ్వుని తెచ్చి పెట్టుకుని పలకరించాల్సి వచ్చింది.

ఎక్కడ తెలుగు మీడియాలో వస్తున్న కధనాలు నిజమేనని మోడీ నమ్మేస్తారేమో అన్నట్టు, అదంతా ఉత్తినే ఎప్పటి నేను నీ బంటూనే , నీ పాదానుదాసుడనే , మీడియా కధానాలేవి మనసులో పెట్టుకోకు , అవి కేవలం మా పచ్చ గొర్రెలకు మాత్రమే అని చెప్తున్నట్టు చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ చూస్తే ఎవరికయినా అర్ధమవుతుంది.

ప్రధాన మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫోటో విడుదల చెయ్యటం తో తెలుగు దేశం పరువు ఢిల్లీ యమునా నదికి పొయ్యే మురికి కాలువల్లో కలిసిపోయింది. ఊహించని ఈ హఠాత్పరిణామం తో చంద్రబాబు కోసం సిద్ధం చేసుకున్న  జాకీలన్నీ పక్కన పడేసి అది మోడీ చెయ్యికాదని, పక్కనున్న విజయన్ ది  అని పచ్చ తమ్ముళ్లు , తెలుగు మీడియా కవరింగ్ చెయ్యటానికి తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే ఈ ఫోటోను విడుదల చేసిన ట్విట్టర్ అకౌంట్ లోనే ఇతర ఫొటోల్లో విజయం హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకుని ఉండటంతో పచ్చ బాచ్ గొంతులో వెలక్కాయ పడ్డట్టయ్యింది

kumaraswamy shake hand with modi

అసలు బాబు మోడీని చూస్తే మరీ అంత ఎందుకు బెండాపోతున్నారు, మోడీ కి మరీ అంత లెక్కలేని తనం ఏంటి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నిర్లక్ష్యంగా ఎడమ చేత్తో షేక్ హ్యాండ్ ఇచ్చే స్థాయికి చంద్రబాబు మన రాష్ట్ర పరువుని దిగజార్చే పనిని ఏమి చేసాడు.

వీటన్నిటికీ సమాధానం ఒక్కటే . చంద్రబాబు ఏనాడు రాష్ట్ర సమస్యల మీద మోడీని కలవలేదు, ఎప్పుడు వెళ్లినా జగన్ని ఎప్పుడు జైల్లో వేస్తారు లేదా నియోజకవర్గాలని ఎప్పుడు పెంచుతారు అనే విషయాలమీదే ప్రధానిని కలిసేవారు. లెక్కలేనన్ని ఆరోపణలు నెత్తున పెట్టుకుని జడ్జీలను మేనేజ్ చేస్తూ గడుపుతున్నాడు , రాష్ట్రంలో రెండు రకాల మీడియాలు ఉండటం తో ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయి చంద్రబాబు వీరుడు – సూరుడు – అపార మేధావి కాదు వొంగునే బ్యాచ్ అని జనాలకి తెలిసిపోయింది , ఎన్ని జాకీలేసినా ఈ సారి చంద్రబాబు గెలవడు. పోయిన సారి కూడా బిజెపి – పవన్ పుణ్యాన గెలిచాడు. గెలిచినా తరువాత చేసిన వెధవ పనులతో వచ్చిన పాపం బిజెపికి కూడా అంటుకుంది. ఇన్ని చేసిన వ్యక్తిని ఎవరయినా పురుగుని చూసినట్లే చూస్తారు. కాకపొతే ఆయన ఎంతయినా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కదా అందుకని లోపలి రానిచ్చారు

ఆర్టికల్ నచ్చితే షేర్ చెయ్యండి , మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ లో వ్రాయండి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here