Home రాష్ట్రీయ వార్తలు అసలు కథ తేల్చండి!

అసలు కథ తేల్చండి!

ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసు… రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే దీనిపై విచారణ జరిగితే ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు. జగన్‌పై దాడికి ప్రయత్నించిన నిందితుడు శ్రీనివాసరావు వరకే ఆగి పోతుంది. దీని వెనుక సూత్రధారులెవరు? పాత్రధారులెవరు? అన్న విషయం వెలుగుచూడదు.

సంఘటన జరిగినరోజునే ముఖ్య మంత్రి చంద్రబాబు, డిజిపి ఆర్‌పి ఠాకూర్‌లు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లతోనే ఈ కేసు విచారణ ఏ విధంగా వుండబో తున్నది తెలిసిపోయింది. పోలీసులు విచా రించినా, సిట్‌ విచారించినా తేల్చేదేమీ వుండదు. అసలు కథ బయటకు రావడం జరగదు. ఇది వైసిపి నేతలకే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు.

జగన్‌ కేసును రాష్ట్ర పోలీసులతోనే మడతపెట్టేయాలనుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి న్యాయస్థానంలో చుక్కెదు రైంది. కేసు విచారణను స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలంటూ బాధితుడిగా జగన్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేయడం తెలిసిందే! దీనిని విచారించిన హైకోర్టు ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తనపై హత్యా యత్నం కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న జగన్‌ పిటిషన్‌పై తదుపరి విచారణలో హైకోర్టు తుది నిర్ణయం తీసు కునే అవకాశముంది. తదుపరి విచారణ వరకు నిట్‌ తన దర్యాప్తును కొనసాగించ వచ్చని కూడా కోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణ సమయంలో కేసులోని వైఫల్యా లను, ప్రభుత్వ ప్రతినిధులుగా ముఖ్య మంత్రి, డిజిపిలు చేసిన ప్రకటనలను కూడా న్యాయమూర్తులు క్షుణ్ణంగా పరిశీ లించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం, డిజిపిలు చేసిన ప్రకటనల వల్లే ఈ కేసుపై నిష్పాక్షిక దర్యాప్తు జరగదనే అనుమానం ఎవరికైనా వస్తుంది. అదే అనుమానం న్యాయమూర్తులకు కూడా కలిగి వుండొచ్చు. కాబట్టి రేపైనా సరే హైకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థకు జగన్‌ హత్యకేసు విచా రణను అప్పగించే అవకాశాలే ఎక్కువుగా వున్నాయి. మరోపక్క వైసిపి నేతల బృందం కూడా ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి జగన్‌పై హత్యాయత్నం కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరారు. సిఎం, డిజిపిల ప్రెస్‌మీట్‌ క్లిప్పింగ్‌లు చూపిస్తే ఎలాంటి వారికైనా ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకే అప్ప గించాలనుకుంటారు. కాబట్టి కేంద్రం కూడా ఈ కేసు విషయంలో వైసిపి నేతల అభిప్రాయానికే విలువనిచ్చే అవకాశముంది.

జగన్‌పై జరిగింది ఏదో ఆకతాయి దాడో, పబ్లిసిటీ డ్రామానో కాదు. ఖచ్చితంగా అతనిని మట్టుపెట్టే కుట్రే! ఇంత దుస్సాహసానికి పాల్పడాల్సిన అవసరం నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు లేదు. అతనికి జీవితమే మారిపోయే ఆఫర్‌లు వచ్చి వుండొచ్చు. అదృశ్య శక్తులే దీనికి వ్యూహరచన చేసి వుండొచ్చు. కేవలం భవిష్యత్‌ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని, అతను సీఎం అయితే రాష్ట్రంలో తమకు మనుగడ కష్టమనుకున్న వాళ్ళే ఈ దుస్సాహసానికి ఒడిగట్టారనే అనుమానాలున్నాయి. సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితేనే కాని ఈ కేసులో దాగున్న నిజాలు బయటకు రావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here