Home జిల్లా వార్తలు అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం… రాజన్న రాజ్యంకు స్వాగతం పలుకుదాం!

అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం… రాజన్న రాజ్యంకు స్వాగతం పలుకుదాం!

రాష్ట్రంలో చంద్రబాబు అవినీతి పాలనకు చరమగీతం పాడి, రాజన్న రాజ్యానికి స్వాగతం పలుకుదామని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపి చేపట్టిన ‘రావాలి జగన్‌-కావాలి జగన్‌’ కార్యక్రమం ముగింపు సభ ఈ నెల 16న నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని కోడూరుపాడులో జరిగింది. ఈ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ, గత 30 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు బాగా ఆదరిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఎన్ని రకాల ఇబ్బందులున్నా వాటిని అధిగమించి రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండడం అభినందనీయమన్నారు. తన శక్తికి మంచి సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నారన్నారు. ‘మన ఎమ్మెల్యే మన ఇంటికి’ పేరుతో 105 రోజులు నియోజక వర్గంలో తిరుగుతూ ఇంటింటికి వచ్చి, ప్రజలు పెట్టిందే తిని, వారి సమక్షంలోనే గడిపారని, ప్రజల్లో ఒకరుగా కలసిపోయారని కొనియాడారు. వైఎస్సార్సీపి అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే కార్యక్ర మాలను, పథకాలను ఆయన ప్రజలకు వివరించారన్నారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలవబోయే ఎమ్మెల్యేగా ప్రజలు భావిస్తున్నారన్నారు. ఆ మాటను మనందరం కలసి నిలబెట్టాలని, అత్యధిక మెజార్టీని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అందివ్వాలని ఆయన కార్యకర్తలను, ప్రజలను కోరారు. ఈ కార్యక్ర మంలో కార్పొరేటర్‌ లేబూరు పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here