Home రాష్ట్రీయ వార్తలు అరుణ్‌జైట్లీని కలిసిన విపిఆర్‌ – ఆదర్శగ్రామంలో బ్యాంకు ఏర్పాటుకై వినతి

అరుణ్‌జైట్లీని కలిసిన విపిఆర్‌ – ఆదర్శగ్రామంలో బ్యాంకు ఏర్పాటుకై వినతి

రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అక్టోబర్‌ 29వ తేదీన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీని ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో కలిసారు. ఆదర్శగ్రామమైన నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడుఅలో బ్యాంకు ఏర్పాటుపై చర్చించారు. పల్లెపాడు గ్రామాన్ని సంసాద్‌ ఆదర్శ గ్రామయోజన క్రింద దత్తత తీసుకున్నానని, ఈ ఒక్క గ్రామంలో 3500మంది జనాభా వున్నారని, చుట్టుపక్కల నిడిముసలి, ముదివర్తిపాలెం, కోడూరుపాడు, కుడితిపాలెం వంటి గ్రామాలతో కలిపి 20వేల మంది జనాభా వున్నారని, ఈ గ్రామాల్లో ఎక్కడా బ్యాంకు సౌకర్యం లేదని, పల్లిపాడులో తక్షణం బ్యాంకు ఏర్పాటుకు చొరవ చూపాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. 1921 ఫిబ్రవరి 7వ తేదీన మహాత్మాగాంధీ స్వయంగా వచ్చి ఈ గ్రామంలో ఆశ్రమాన్ని ప్రారంభించారని, దక్షిణ భారతదేశంలో ఇదే ఏకైక గాంధీ ఆశ్రమమని ఆయన పేర్కొన్నారు. ఇంతటి విశిష్టమైన గ్రామంలో బ్యాంకులను ఏర్పాటు చేయాలని ఎంపి విపిఆర్‌ కోరగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అందుకు సానుకూలంగా స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here