Home రాష్ట్రీయ వార్తలు అమ్మాయిలపై టీజింగ్ కేసులు పెడతానన్న పపన్

అమ్మాయిలపై టీజింగ్ కేసులు పెడతానన్న పపన్

పవన్ అంటే ఆయన ఫ్యాన్స్ కు ఎంత పిచ్చో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఆ పిచ్చి పీక్స్ కు ఎక్కేసింది. అబ్బాయిలకే కాదు. అమ్మాయిలకు కూడా. ఒక విధంగే అబ్బాయిలే నయమనిపించేలా తమ పిచ్చిని చాటుకున్నారు పవన్ ను అభిమానించే అమ్మాయిలు. పవన్ బహిరంగ సభలో పదేపదే పవన్ ప్రసంగానికి అడ్డుపడుతూ అమ్మాయిలు పవన్… పవన్… పవన్ కళ్యాణ్ అంటూ రెచ్చిపోయారు. ఆ దెబ్బతో పవన్ కళ్యాణ్ కు ఏమి చేయాలో అర్ధంకాక వారిని సరదాగా కామెంట్ చేస్తూ… ‘అమ్మాయిలు కూడా ఇంత రౌడీల్లా తయారైతే ఎలా చెప్పండి.. అబ్బాయిలు చేస్తే ఈవ్ టీజింగ్ అంటారని.. మరి అమ్మాయిలు చేస్తే ఆడమ్ టీజింగ్ అనాలా మనం.. అమ్మాయిలు మీమీద ఆడమ్ టీజింగ్ కేసులు పెట్టిస్తా.. ’ అన్నాడు. అయినా కూడా అమ్మాయిలు తన మాట వినకపోయేసరికి, ‘అమ్మాయిలు నా సభలో ఇంత అల్లరి చేస్తున్నారంటే ఏం చేయాలి చెప్పండి.. అబ్బాయిలు అల్లరి చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. ఆడపడుచులు మీరు కూడా నన్ను ఏడిపిస్తే ఎలా చెప్పండి’ అంటూ మరోసారి సరదాగా కామెంట్ చేస్తూ మీ ప్రేమను నేను అర్ధం చేసుకున్నానను అన్నాడు. పవన్ కు అభిమానులు కాదు, వీరాభిమానులే వుంటారు అనేందుకు ఇదొక నిదర్శనమేమో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here