Home గల్పిక అమరావతిలో ఐక్యరాజ్యసమితి!

అమరావతిలో ఐక్యరాజ్యసమితి!

పాతిక ప్రపంచ మేటి నగరాల డిజైన్‌ లను కాసి వడపోసి తీస్తే వచ్చినట్లుండే అమరావతి సిటి. ఉండవల్లిలోని హైటెక్‌ రత్న, సీఎం చంద్రబాబు నివాసం. చంద్రబాబు తన గదిలో కూర్చుని… దేశంలో నేను కలవాల్సిన పార్టీల నాయ కులు ఇంకా ఎవరన్నా మిగిలి వున్నారా అని ఆలోచించుకుంటున్నాడు. ఎస్పీ, బిఎస్పీ, ఎన్‌సిపి, కాంగ్రెస్‌, ఆప్‌, జెడిఎస్‌, ఎన్‌సి, తృణమూల్‌… ఇంకా ఎవరన్నా మిగిలివున్నారా? అని ఆయన ఆలోచి స్తుండగా భువనేశ్వరీదేవి, లోకేష్‌, దేవాన్ష్‌, బ్రాహ్మిణిలు అక్కడకు వచ్చారు. చంద్రబాబు వారిని చూసి… కూకట్‌ పల్లిలో సుహాసిని ప్రచారం కోసం బయల్దే రారా అని అడిగాడు. వెంటనే భువ నేశ్వరి.. ఎప్పుడు చూసినా మీకు ఆ రాజకీయాల పిచ్చేనా… కాస్తన్నా ఎంటర్‌ టైన్‌మెంట్‌ అవసరం లేదా… రండి ఈరోజు సన్‌డే, ఆ హోం థియేటర్‌లో కూర్చుని ఏదన్నా సినిమా చూద్దాం అని అంది. సరే పదండి నాకూ కాస్త రిలీఫ్‌గా వుంటుందంటూ చంద్రబాబు కూడా లేచాడు. అంతలో అక్కడకు మంత్రులు జవహర్‌, పితాని సత్యనారాయణ, పి.నారాయణ, నిమ్మకాయల చినరాజప్ప, కె.ఇ.కృష్ణమూర్తి, సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి, యనమల రామకృష్ణుడు, జలీల్‌ఖాన్‌లు వచ్చారు. చంద్రబాబు వారితో… రండి సమయానికి వచ్చారు. హోం థియేటర్‌లో కూర్చుని సినిమా చూద్దామని అన్నాడు. వెంటనే మంత్రి జవహర్‌… సార్‌, టిక్కెట్లు బుక్‌ చేసారా, నన్నేమన్నా తీసుకురమ్మంటారా అని అడిగాడు. అది విని చంద్రబాబు తల బాదుకుని అక్కడ టిక్కెట్స్‌ అవసర ముండవులే… రా… అని చెప్పాడు. వెంటనే సోమిరెడ్డి… సార్‌, నాకు ఇంట్ర వెల్‌లో మాత్రం పాప్‌కార్న్‌, పఫ్‌ కావాలి అని అడిగాడు. పాప్‌కార్న్‌ ఏంటి… చికెన్‌ బిరియానినే తీసిస్తాలేరా… అంటూ హోం థియేటర్‌లోకి తీసుకెళ్ళాడు. అందరు కూర్చున్నాక రామ్‌ హీరోగా నటించిన ‘రెడీ’ సినిమా పెట్టారు. సినిమా సాగిపోతోంది. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇంట్ర వెల్‌ తర్వాత బ్రహ్మానందం వస్తాడు. మెక్‌డోవెల్‌ మూర్తి అతని పేరు. విలన్‌లు కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్‌రెడ్డి లకు కంబైన్డ్‌ ఆడిటర్‌. మూర్తి వద్ద హీరో రామ్‌ అసిస్టెంట్‌గా చేరుతాడు. ఇక్కడే రామ్‌ తన కుటుంబసభ్యులను చికాగో సుబ్బారావు, డల్లాస్‌ రామారావుల పేర్లతో ప్రవేశపెడతాడు. వారి పేర్లను బ్రహ్మానందం చేతే చెప్పిస్తాడు. బ్రహ్మా నందం ఉత్తుత్తిగా చెప్పిన పేర్లు క్యారక్టర్ల రూపంలో వస్తుంటాయి. అప్పుడు బ్రహ్మా నందం ఆశ్చర్యంగా… అదేంట్రా నేను సృష్టించిన క్యారెక్టర్‌లు ఇలా వరుసబెట్టి వస్తున్నాయని అంటాడు. అప్పుడు రామ్‌ అతనితో… మీరే ఒక బ్రహ్మ… మీరను కుంటే ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించ గలరు అంటాడు. స్క్రీన్‌పై ఆ డైలాగ్‌ వచ్చిన సమయంలోనే నిమ్మకాయల చినరాజప్ప, జవహర్‌, నక్కా ఆనంద బాబు, పి.నారాయణలు చంద్రబాబు వైపు చూశారు. ఏం అలా చూస్తున్నారని వారిని చంద్రబాబు అడిగాడు. అప్పుడు జవహర్‌… మీలోనూ మాకు ఒక అపర బ్రహ్మ కనిపిస్తున్నాడు సార్‌ అని అన్నాడు. ఏదో మీ అభిమానంగాని నాకు అంత టాలెంట్‌ వుందంటారా అని చంద్రబాబు మొహమాటంగా అన్నాడు. ఉందా… టాలెంట్‌ మీలో వుందా… కిలోల లెక్కన కాదు సార్‌, టన్నులు టన్నుల లెక్కన మీలో వుంది. మీరనుకుంటే కొత్త ప్రపంచాన్ని కాదు, సరికొత్త విశ్వాన్నే సృష్టించగలరని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నాడు. అప్పుడు చిక్కిందే సందను కుని లోకేష్‌ ఎత్తుకున్నాడు. ముందు సినిమాను ఆపేయించాడు. తర్వాత తండ్రితో… అవును నాన్నారు… సృష్టికి ప్రతిసృష్టి చేయగల టాలెంట్‌ మీకే వుంది. ఈ విషయం నేను బయట చెపుతుంటే ఎవరూ నమ్మడం లేదు, ఒక్కసారి ప్రయ త్నించి చూడండి నాన్నారు అని బ్రతిమ లాడుకున్నాడు. అప్పుడు చంద్రబాబు… ఓకే ఓకే… ముందు విశ్వం, ప్రపంచం సృష్టించడం మాటేమోగాని, ఒక దేశాన్ని సృష్టిద్దామన్నాడు. దానికి లోకేష్‌… ఆల్‌రెడీ తాత గారు తెలుగుదేశంను సృష్టించారు కదా! అని ప్రశ్నించాడు. నేను చెప్పేది పార్టీ పేరు గురించి కాదు… మన రాష్ట్రం పేరు గురించి… మన పార్టీ పేరునే రాష్ట్రానికి పెడితే ఎలా వుంటుం దంటావ్‌ అని కె.ఇ.కృష్ణమూర్తిని అడి గాడు. అందుకాయన… భేషుగ్గా వుం టుంది. జగన్‌, పవన్‌లతో సహా అప్పు డందరూ తెలుగుదేశంలోనే వున్నట్లవు తుంది అని చెప్పాడు. చంద్రబాబు వారితో… ఇక నుండి మనకు మనమే రాజులం, మన దేశం స్వతంత్రదేశం, మన దేశంలోకి సిబిఐ ప్రవేశానికి అను మతి లేదంటూ వెంటనే జి.ఓ తయారు చేయండి అని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పను ఆదేశించాడు. ఇక మనకు సిబిఐ తలనొప్పి వుండదు. స్కాంలు, అవినీతి, అక్రమాలు చేసినవాళ్ళు ఇక్కడ భయపడాల్సిన పనిలేదు. వాళ్ళకు ఈ రాజ్యం సంపూర్ణ రక్షణ కల్పిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘంతో కూడా మనకు అవసరం లేదు. ఈ దేశంలో మన ఎన్నికలను మనమే నిర్వహించుకుంటాం, ఓట్లు కూడా మనమే లెక్క పెట్టు కుందాం… ఆఖరకు విజేతలను కూడా మనమే నిర్ణయిస్తాం అని చెప్పగా… అప్పుడే అక్కడకు వచ్చిన చిత్తూరు ఎంపి వరప్రసాద్‌ అంతా విని… సార్‌, ఇన్ని ప్రత్యేకంగా పెట్టుకుంటున్నప్పుడు ప్రత్యే కంగా మన దేశానికి రాష్ట్రపతిని కూడా పెట్టుకుంటాం కదా… దళితుడిగా తొలి రాష్ట్రపతిని నన్నే చేయాలని అడిగాడు. అంతలో జలీల్‌ఖాన్‌ లేచి… అదేం కుదరదు, రాష్ట్రపతిగా ముస్లింలకే తొలి అవకాశమివ్వాలి, అదీగాక ఈ దేశంలో బి.కాంలో ఫిజిక్స్‌ చదివిన ఏకైక వ్యక్తిని నేనే కాబట్టి నాకే రాష్ట్రపతి పదవి ఇవ్వా లన్నాడు. అప్పుడు యనమల రామ కృష్ణుడు జోక్యం చేసుకుని… అసలు తెలుగుదేశం పార్టీని మోసిందే బీసీలు… నేను గతంలోనే స్పీకర్‌గా చేసున్నాను… కాబట్టి అటు బి.సిగా ఇటు సీనియర్‌గా తొలి రాష్ట్రపతి ఛాన్స్‌ తనకే కావాలని యనమల అడిగాడు. అప్పుడు చంద్ర బాబు… పదవుల సంగతి తర్వాత… ముందు జరగాల్సింది చూడండి. మనమే సుప్రీం కోర్టును పెట్టుకుంటాం, తెలుగు దేశం పార్టీ జెండానే మన జాతీయ జెండా అవుతుంది. మన పార్టీ కార్య కర్తలనే మన దేశ సైనికులుగా పెట్టు కుంటాం. ప్రతి జిల్లా కేంద్రంలో అంతర్జా తీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేసి సింగపూర్‌కు డైలీ సర్వీసులు నడు పుదాం… వచ్చే ఒలింపిక్స్‌ను అమరా వతిలో నిర్వహించి భారతదేశాన్నే మించిపోయేలా మన తెలుగుదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపు తామని అన్నాడు. అప్పుడు లోకేష్‌… ఇవన్నీ ఓకే డాడీ… అమరావతిలో ఒక ఐక్యరాజ్యసమితి భవనాన్నే నిర్మిద్దాం. ఇండియాలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసినట్లే ఐక్యరాజ్య సమితిలో మన ఆధిపత్యం వుండేలా అమెరికాకు వ్యతిరేకంగా మిగిలిన అన్ని దేశాలతో ఓ కూటమి కడదాం… అప్పుడు మీరు ఈ దేశానికి కాదు… ఈ ప్రపంచానికే నాయకుడవుతారు అని చెప్పాడు. లోకేష్‌ చెప్పిన లాజిక్‌ విని అక్కడున్న వాళ్లందరు కూడా… చంద్ర బాబుకు తగ్గ కొడుకు పుట్టాడని మెచ్చు కోలుగా చూశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here