Home రాష్ట్రీయ వార్తలు అభ్యర్థులే ఆధారం

అభ్యర్థులే ఆధారం

తెలంగాణ ఫలితాల దెబ్బకు చంద్రబాబుకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాకయ్యింది. తెలంగాణలో కాంగ్రెస్‌ను కలుపుకుని గెలిచి తానేంటో చూపాలనుకున్నాడు. తామేంటో తెలంగాణ ప్రజలు ఆయనకు చూపించారు. తెలంగాణలో కూటమి గనుక అధికారంలోకి వచ్చుంటే మహాకూటమిని గెలిపించిన మహానాయకుడిగా చంద్రబాబు పేరును మోతెక్కిస్తుండేది పచ్చమీడియా! తెలంగాణలో చెప్పుకునే అవకాశమివ్వకనే చంద్రబాబు ఇప్పుడు మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో బీజేపీ ఓటమికి తామే కారణమని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.

తెలంగాణలో గెలుపు కోసం కేసీఆర్‌ ఏ ఫార్ములాను అయితే అనుసరించాడో, చంద్రబాబు కూడా అదే ఫార్ములాను అనుస రిస్తానంటున్నాడు. ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తానని చంద్రబాబు ప్రకటించాడు. అంటే జనవరి లోనే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తా డన్నమాట! కేసీఆర్‌ కూడా మూడు నెలల ముందే 105మంది అభ్యర్థులను ప్రకటిం చడం జరిగింది. దీనివల్ల అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాలలో లోటుపాట్లను తెలుసుకోగలిగారు. వాటిని సరిచేసుకు న్నారు. అసంతృప్తులను బుజ్జగించారు. వర్గ విభేదాలు చల్లబడేలా చేశారు. అన్నింటికి మించి మూడు నెలల సమయంలో ఎన్ని కల నోటిఫికేషన్‌ వెలువడకముందే తమ తమ నియోజకవర్గాలను చుట్టగలిగారు. మహాకూటమిలోని పార్టీలు సీట్లు సర్దు బాటు చేసుకునే సరికి టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రజల్లోకి ముమ్మరంగా వెళ్లిపోయారు.

అయితే టిఆర్‌ఎస్‌ విజయంలో అభ్యర్థులే కాదు, కేసీఆర్‌ ప్రభుత్వానిదీ ఫ్రధాన భూమిక. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, రైతాంగం కోసం చేపట్టిన పనులపై ప్రజలు సానుకూలంగా స్పందించారు. దీనికితోడు చంద్రబాబు తెలంగాణ రాజకీయాలలో తల దూర్చడం కూడా టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చింది. టిఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌గా వుండాల్సిన ఎన్నికల పోరు కాస్తా కేసీఆర్‌ వర్సెస్‌ చంద్రబాబు అన్నట్లుగా మారింది. ఇదే కాంగ్రెస్‌ కొంప ముంచింది.

కాని, ఏపిలో చంద్రబాబు ఎంత ముందుగా అభ్యర్థులను ప్రకటించినా తెలంగాణ వాతావరణం రాదు. అక్కడ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు. అక్కడక్కడా వ్యతిరేకత వున్నట్లు సీన్లను చంద్రబాబు అనుకూల మీడియానే సృష్టిం చింది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అది కాదు. ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వుంది. అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువుగా వుంది. రైతాంగ సమస్యలు అలానే వున్నాయి. ఆర్భాటాలకు తప్ప ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు లేవు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో సానుకూల ధోరణి లేదు. ఈ పరిస్థితులలో చంద్రబాబుకు వున్న పెద్ద ఆధారం అన్ని నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులను దించడం.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపులోనూ ఆ పార్టీ అభ్యర్థులదే ప్రధానపాత్ర! ఆ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులుగా జగన్‌ కొత్త నాయకులను ఎక్కువుగా రంగంలోకి దింపాడు. వారి నియోజకవర్గాలలో వాళ్ళ బలం తక్కువ. 2014లో వైసిపి తరపున 67 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఖచ్చితంగా 80శాతం మంది ఎమ్మెల్యేలు జగన్‌ గాలితో గెలిచిన వాళ్లే! ఓ 20శాతం మంది మాత్రం జగన్‌ గాలితో పాటు తమ పరపతితో గెలిచివుంటారు. కాని, తెలుగు దేశం నుండి 103మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, వారిలో ఖచ్చితంగా 80శాతం మంది తమ నియోజకవర్గాలలో తమకున్న పరపతి పలుకుబడితో గెలిచిన వాళ్ళే! కొంత పార్టీ ఓట్లు వీరికి కలిసుండవచ్చు. కాని, అక్కడ వీళ్ళు గట్టి అభ్యర్థులుగా వుండబట్టే గెలవగలిగారు. అప్పటికీ తెలుగుదేశంలో వున్న సీనియర్‌ నాయకు లతో పాటు కాంగ్రెస్‌ నుండి వెళ్లిన సీని యర్‌లు, ముదుర్లు కూడా తెలుగుదేశం అభ్యర్థులు కావడంతో, అభ్యర్థుల బలంపై తెలుగుదేశం విజయం సులభమైంది.

ఈసారి కూడా చంద్రబాబు బలం గట్టి అభ్యర్థులే! ఈ ఐదేళ్లలో అధికారం చేతిలో వుంది కాబట్టి వాళ్ళు ఇంకా బలవంతులయ్యారు. వీరిని మూడు నెలలు ముందుగానే అభ్యర్థులుగా ప్రకటిస్తే ఎంతో కొంత పార్టీకే ఉపయోగం. మరి ప్రభుత్వ వ్యతిరేకతను ఈ బలవంతులైన అభ్యర్థులు ఎంతవరకు అధిగమిస్తారో, చంద్రబాబు ఆశలను ఏమేరకు నిలబెడతారో చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here