నెల్లూరు లోక్‌సభ, నెల్లూరురూరల్, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు… ఈ మూడింటికి ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడుతున్నాడు. ఇప్పటివరకు నెల్లూరురూరల్ ఇన్‌ఛార్జ్‌గా తనదైన శైలిలో పనిచేసాడు. రూరల్ ప్రజలకు అందుబాటులో వుండడమేకాక తాను లేకపోయినా రూరల్‌లో కార్యక్రమాలు కొనసాగేలా తన ప్రతినిధిగా విజయ డెయిరీ ఛైర్మెన్ కొండ్రెడ్డి రంగారెడ్డిని నియమించి ఆయన ద్వారా పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తూ వచ్చాడు.
ఆత్మకూరు రాజకీయాలలో మారిన పరిస్థితులను బట్టి తెలుగుదేశం పార్టీకి అక్కడ కూడా ఆదాల ప్రభాకర్‌రెడ్డినే ఇన్‌ఛార్జ్‌గా పెట్టాల్సివచ్చింది. ఆత్మకూరు ఇన్ఛార్జ్ తనకే ఇవ్వాలని చెప్పి గూటూరు కన్నబాబు ఎంత ఆగిత్తం చేసినా పార్టీ అధిష్టానం కనికరించలేదు. స్థానికంగా ఎవరికీ ఇన్ఛార్జ్ ఇవ్వకుండా తాత్కాలి కంగా ఆదాలను పెట్టింది.
ఆనం రామనారాయణరెడ్డి టీడీపీని వదులుతుండడం ఆత్మకూరులో ఆ పార్టీకి పెద్దషాకే! ఆనంకు సరితూగగల అభ్యర్థి ఆత్మకూరుకు ఇక లేడు. ఆనం పార్టీ వదిలిపోతే వచ్చే లోటును పూడ్చుకోవా లంటే కన్నబాబుతోనో, చిన్నబాబుతోనో అయ్యే పని కాదు. అందుకే అందరితో సత్సంబంధాలు నడపగల ఆదాలను బరిలోకి దించారు.
ప్రస్తుతం ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆత్మ కూరుపై ప్రత్యేకదృష్టి పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ప్రతి మండలంలోనూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తు న్నాడు. తాను ఆత్మకూరు అభ్యర్థిని కానని స్పష్టం చేస్తూనే, కార్యకర్తలకు అండగా వుంటానని మాత్రం భరోసా ఇస్తున్నాడు. ఆత్మకూరులో ఆదాల సభలను కన్నబాబు వర్గీయులు పూర్తిగా బహిష్కరిస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఛైర్మెన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి వర్గీయులు మాత్రం పార్టీ ఆదేశానుసారం ఆదాల వెంట నడుస్తూ ఆయన కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. మొత్తానికి ఆనం వదలడంతో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీలో ఏర్పడ్డ కొరతను ఆదాల ఎంతవరకు భర్తీ చేయ గలడు? అన్నదే పెద్ద ప్రశ్న! ఆదాల ఇంకో నాలుగు నెలలు ఇక్కడే తిరిగతే పార్టీ అనుకున్నంతగా బలహీనపడక పోగా కొంతవరకు గట్టిగానే నిలబడే అవకాశముంది.
