Home రాష్ట్రీయ వార్తలు అపవిత్ర బంధం!

అపవిత్ర బంధం!

తెలుగు జాతి ఆత్మ గౌరవం… తెలుగు పౌరుషం… తెలుగు భాష కమ్మదనం… తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం… ఇవేవీ చంద్రబాబుకు తెలియవు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. ఎందుకంటే తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీలో వున్నాడు. కాబట్టి ఎన్టీఆర్‌లోని కాంగ్రెస్‌ వ్యతిరేక భావజాలాన్ని, తెలుగుజాతి ఆత్మగౌరవం కాపాడడంపై ఆయనలోని పట్టుదలను చంద్రబాబుకు గమనించే అవకాశం లేకుండాపోయింది. కాబట్టే ఎన్టీఆర్‌కు అన్వయించదగిన ఈ మాటలు చంద్రబాబుకు అతకవు. అంతేకాదు, ఎన్టీఆర్‌ పార్టీని పెట్టినప్పుడు, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంగాని, ఎన్టీఆర్‌ సీఎం అవుతాడనే ధీమాగాని చంద్రబాబులో లేవు. ఉండుంటే ఆయన అప్పుడే తెలుగుదేశంలో చేరుండేవాడు కదా!

ఎన్టీఆర్‌ పాటించిన సిద్ధాంతాలు, విలువలను చంద్రబాబు పాటించక పోతుండబట్టే ఈ రోజు ఆయన కాంగ్రెస్‌తో సైతం పొత్తుకు సిద్ధమయ్యాడు. తెలుగు దేశం పార్టీ 35ఏళ్ళ చరిత్రలో బీజేపీతో పొత్తు పెట్టుకుంది, కమ్యూనిష్టులతో అంట కాగింది, టీఆర్‌ఎస్‌, జనసేన వంటి పార్టీలతోనూ పొత్తు నడిచింది. అయితే ఇదంతా ఒకెత్తు, కాంగ్రెస్‌తో కలిసి ఎన్ని కలకు పోవాలనుకోవడం మరోఎత్తు. ఎన్టీఆరే వుంటే కలలో కూడా ఇది జరిగేది కాదు. కాని, చంద్రబాబు సగం బ్లడ్‌ కాంగ్రెస్‌దే! కాబట్టే కాంగ్రెస్‌ను ఎన్టీఆర్‌ చూసినంత విరోధంతో చంద్రబాబు చూడ్డం లేదు.

తెలంగాణకు ముందస్తు ఎన్నికలు ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తుకు చంద్రబాబు సిద్ధమవడం జరిగింది. హైదరాబాద్‌కు వెళ్లి టీ-టీడీపీ నేతలకు దీనిపై మార్గనిర్దేశం చేసారు. కాంగ్రెస్‌తో పొత్తును తెలంగాణ టీడీపీ నాయకులు కొందరు వ్యతిరేకించినా చంద్రబాబు ఖాతరు చేయలేదు. కాంగ్రెస్‌తో ఖచ్చితంగా కలిసి ఎన్నికలకు పోతున్నామని తేల్చి చెప్పేశాడు. తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీల మధ్య సీట్ల పంపకమే మిగిలి వుంది. తెలంగాణలో ఈ కాంబినేషన్‌ విజయవంతమైతే ఏపి ఎన్నికల్లోనూ ఇదే కాంబినేషన్‌ పునరావృతమవుతుంది.

అధికారం కోసం, రాజకీయ అవస రాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగ జారిపోతాడనేందుకు కాంగ్రెస్‌తో పొత్తే

ఉదాహరణ. నిఖార్సయిన ఎన్టీఆర్‌ అభిమానులుగాని, ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు ఆయన వెంట వున్న నాయకులు కాని కాంగ్రెస్‌తో పొత్తును జీర్ణించుకోలేరు. చంద్రబాబు అంటే పూర్తి తెలుగుదేశం కాదు. హాఫ్‌ కాంగ్రెస్‌. మరి ఎన్టీఆర్‌ కుటుంబసభ్యుల పరిస్థితి ఏంటి? కాంగ్రెస్‌తో పొత్తును వాళ్ళు స్వాగతి స్తారా? చంద్రబాబు నిర్ణయాన్ని సమర్ధించి తమ తండ్రి నినదించిన తెలుగుజాతి ఆత్మగౌరవానికి వెన్నుపోటు పొడుస్తారా? తెలంగాణ, ఏపిలోని టీడీపీ నాయకులు కాంగ్రెస్‌తో కలిసి ఎలా పని చేయగలరు? టీడీపీ జెండా పట్టుకున్న చేతితో కాంగ్రెస్‌ జెం డాను ఎలా పట్టుకోగలరు? ఆంధ్రప్రదేశ్‌ను కుక్కలు చింపిన విస్తరి చేసిన కాంగ్రెస్‌పార్టీ నాయకులతో కలసి వెళ్లి ఓట్లు ఎలా అడగ్గలరు? కాంగ్రెస్‌తో పొత్తుపై ఇప్పటికే ఏపిలో కొందరు నాయకులు నిరసన గళం వినిపించి వున్నారు. రేపు చంద్రబాబు వాళ్ల నోళ్ళు మూయించగలడా? లేక వాళ్ళే నోర్లు మూసుకుని చంద్రబాబు దారిలో నడవ గలరా? సరే నాయకులను, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులను చంద్రబాబు నోరు మూయిస్తాడనుకుందాం! ఎన్టీఆర్‌ అభి మానులు, ప్రజలు అలా కాదుకదా! కాంగ్రెస్‌తో జతకట్టి వచ్చిన చంద్రబాబు వారి దృష్టిలో ఒక అవకాశ వాదిగానే మిగిలిపోతాడు!

టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు అన్నది తొలి ప్రయోగం. ముందు తెలంగాణలో ఈ ప్రయోగం జరుపుతున్నారు. అక్కడ విజయ వంతమవుతుందో, వికటిస్తుందో చూడాలి. తెలంగాణలో అటూ ఇటుగా వున్నా ఖచ్చి తంగా ఏపి ప్రజలు మాత్రం ఛీ కొడతారు. ఎందుకంటే కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర విభజన పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయాన్ని, ఆనాటి దుర్మార్గపు చర్యలను ఆంధ్రులెవరూ మరచిపోలేదు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here