Home జిల్లా వార్తలు అధినేతతో నాలుగు మాటలు.. కప్పు కాఫీ… అందరూ దారిలో పడతారు!

అధినేతతో నాలుగు మాటలు.. కప్పు కాఫీ… అందరూ దారిలో పడతారు!

నెల్లూరుజిల్లా వైసిపిలో అల కలని, అసంతృప్తని, కొందరు నాయకులు పార్టీ వదిలిపోబో తున్నారని, జగన్‌కు భారీ షాక్‌ ఇవ్వనున్నారనీ ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. వైసిపిలో జరిగే గోరంత దాన్ని కొండంతగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. కాని ఇక్కడంత సీన్‌ లేదు. ఎవరూ పార్టీని వదిలి పోయే పరిస్థితి లేదు. తెలుగుదేశంలో చేరే అవసరం అంతకన్నా లేదు. ఇవన్నీ కూడా వైసిపి అధినేత జగన్‌ స్వయంగా కలుగజేసుకుని నాలుగు మాటలు మాట్లాడితే సర్దుబాటయ్యేవే!

మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవడం వల్ల వైసిపిలో కొంత అలజడి రేగింది. ముఖ్యంగా వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న జడ్పీ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ఆయన అలగడంలో అర్ధముంది. వెంకటగిరిలో వైసిపికి ఎవరూ లేనప్పుడు ఆయనే ఇన్‌ఛార్జ్‌ అయ్యాడు. నాలుగున్నరేళ్ళు సొంత ఖర్చులతోనే కార్యక్రమాలను నడిపాడు. వెంకటగిరి సీటుపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని వున్నాడు. ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి వైసిపిలో చేరాడు. వెంకటగిరి టిక్కెట్‌ ఆయనదేననే ప్రచారం వుంది. ఆనంను పార్టీలోకి తీసుకునే ముందు జగన్‌ ఒక్క మాట రాఘవతో మాట్లాడివుంటే సరిపోయేది. ఏ పరిస్థితుల్లో ఆనంను పార్టీలోకి తీసుకోవాల్సి వచ్చిందో చెప్పి, ఆనంకు వెంకటగిరి సీటు ఇచ్చే విషయమై ముందుగానే చెప్పి ఒప్పిస్తే ఇక్కడ పెద్ద సమస్య లేదు.

ఆనంను పార్టీలోకి తీసుకోవడం వల్ల మేకపాటి సోదరులు అలిగారనే ప్రచారమూ వుంది. జగన్‌ మీద వాళ్ళు అలగాల్సిన అవసరమే లేదు. అసలు ఆనం రామనారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవాలన్న తొలి ఆలోచనే మేకపాటి గౌతంరెడ్డిది. బీజం వేసింది వాళ్ళే అయినప్పుడు ఆనంను తీసుకోవడంపై వాళ్ళు అలగడమెందుకు? అదీగాక వైసిపిలో ఆ కుటుంబానికి వున్న ప్రాధాన్యత ఇంకే కుటుంబానికి వుంది? వాళ్ళు వైసిపిని వదిలిపోతే వాళ్ళ నెత్తిన వాళ్ళు మట్టి చల్లుకున్నట్లే! ఎందుకంటే వైసిపి వాళ్ళకు బలంగాని, వైసిపికి వాళ్ళు బలం కాదు. కావలి విషయంలో కూడా స్వయంగా జగన్‌ కలుగుజేసుకుంటే ఇక్కడ కూడా పార్టీ గాడిలో పడుతుంది. జగన్‌ స్వయంగా కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డిలతో మాట్లాడితే ఇద్దరూ దారికొస్తారు. జిల్లాలో కొంతమంది నాయకులతో జగన్‌ స్వయంగా మాట్లాడాల్సి వుంది. దాదాపు 8ఏళ్లుగా తన వెంట నడుస్తున్న వారిని నొప్పించకుండా, కొత్తగా వస్తామన్న వారిని కాదనకుండా ఆయనే స్వయంగా మాట్లాడితే జిల్లాలో పార్టీ పరిస్థితి ఇంకా మెరుగవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here