Home జిల్లా వార్తలు అక్రమ రవాణాదారులకు, అవినీతిపరులకు తాత్కాలిక రిలీఫ్‌ . – 35 రోజుల శిక్షణకు ఎస్పీ...

అక్రమ రవాణాదారులకు, అవినీతిపరులకు తాత్కాలిక రిలీఫ్‌ . – 35 రోజుల శిక్షణకు ఎస్పీ రామకృష్ణ

జిల్లా ఎస్పీగా ఛార్జి తీసుకున్న రోజు నుండి అక్రమ రవాణాదారులకు, బెట్టింగ్‌ బ్యాచ్‌కు, అరాచక శక్తులకు, అలాగే తన శాఖలోని అవినీతిపరులకు కంటి మీద కునుకులేకుండా చేసిన పిహెచ్‌డి రామకృష్ణ 35రోజుల శిక్షణ నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్ళాడు. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో 35రోజుల పాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా 110మంది ఐపిఎస్‌లను ఎంపిక చేసారు. ప్రతిఒక్క ఐపిఎస్‌ ఈ శిక్షణకు హాజరు కావాల్సి వుంటుంది. రామకృష్ణ ఇంతవరకు ఈ శిక్షణ తీసుకోకపోవడంతో ఆయనను ఎంపిక చేసారు. ఆయన శిక్షణ పూర్తి చేసుకుని వచ్చేవరకు ప్రకాశం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు జిల్లా ఇన్‌ఛార్జ్‌ ఎస్పీగా వ్యవహరించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here