Home రాష్ట్రీయ వార్తలు అందరిచూపు… ఉత్తరం వైపే!

అందరిచూపు… ఉత్తరం వైపే!

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పోలింగ్‌ తేదీ దగ్గర పడే కొద్ది జనంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంటుంది. అధికారమే లక్ష్యంగా అటు తెలుగుదేశం, ఇటు వైయస్సార్‌

కాంగ్రెస్‌పార్టీలు ప్రచార ఉధృతిని పెంచాయి. ఇంత జరుగుతుంది సరే… ఎన్నికల్లో గెలుపెవరిది? అన్న ప్రశ్న ప్రతి ఒక్క ఆంధ్రుడిలో అనుక్షణం మెదలుతోంది. ఫలితాల విషయంలో ఎవరి లెక్కలు వాళ్ళకు వున్నా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు ఎటు మొగ్గితే అటే అధికారం అన్నది పక్కాగా తేలుతోంది. 2014 ఎన్నికల్లో పవన్‌ ఫ్యాక్టర్‌ పని చేయబట్టి ఈ ఐదు జిల్లాల్లోనూ టిడిపి అత్యధిక స్థానాలు సాధించి అధికారాన్ని కైవసం చేసుకోగలిగింది.

కాని, 2019లో అవే పరిస్థితులు వున్నాయా? రాయలసీమలోని నాలుగు జిల్లాలు అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలులతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను తీసుకుంటే ఈ ఆరు జిల్లాల్లో ఒక్క సీటైనా వైకాపాకే ఎక్కువ వస్తుంది. ఇందులో సందేహమే లేదు. ఈ జిల్లాల్లోనే వైసిపి మైనార్టీలో పడితే ఆ పార్టీ మొత్తం సీట్లు 50కు మించవు. గుంటూరు, కృష్ణ జిల్లాల్లో సామాజిక సమీకరణల దృష్ట్యా ఇరు పార్టీలకు మధ్య పెద్ద అంతరం వుండకపోవచ్చు. కాని చూపంతా ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల మీదే! 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు కాపు కాసిన కాపులు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో టిడిపి గతంలోలాగా క్లీన్‌ స్వీప్‌ చేస్తేనే ఆ పార్టీ అవకాశాలు మెరుగ్గా వుంటాయి. అలాకాకుండా వైసిపి, టిడిపికి సమానంగా సీట్లు సాధించినా టిడిపి ప్రమాదంలో పడ్డట్లే! చూద్దాం ఉత్తరజిల్లాల ఓటర్లు ఏ పార్టీకి తూర్పుదిక్కు చూపించనున్నారో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here